ఇస్లామిక్‌ ఉగ్రవాద వలయంలో ప్రపంచంతురక మతోన్మాదులచే నిర్వహించబడే ఇస్లామిక్ తీవ్రవాదంతో మొత్తం మానవాళి ఉక్కిరిబిక్కిరి ఔతున్నది. భారతదేశానికి సమస్య ఎప్పటినుంచో ఉన్నా, సభ్య ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు, కానీ నవంబర్ 13, శుక్రవారం నాడు పారీస్ నగరంపై జరిగిన, ఇస్లామిక్ దాడి తో మొత్తం పాశ్చాత్యదేశాలు ఉలిక్కిపడి, తీవ్రతను అర్థం చేసుకుంటున్నాయి. దాడిలో 130 మంది పారీస్ పౌరులు మరణించారు. అందులో కొద్దిమంది విదేశీయులు కూడా ఉన్నారు. ఐతే ఫ్రాన్స్ మాత్రం ఉత్తుత్తి నిరసనను తెలపకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగింది. ఐఎస్ఐఎస్ రాజధానిరక్కాను బాంబులతో చితక్కొట్టింది. దాడి జరిగిన వారంలోపు దాడిచేసిన తీవ్రవాదులందరినీ నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టింది. సంఘటన నుండి మనం కూడా నేర్వవలసిన పాఠాలు చాలానే ఉన్నాయి. తీవ్రమైన ఉగ్రవాద దాడులకు గురైన దేశాలు 162కి పైగా ఉన్నాయి. భారత్, ఇజ్రాయెల్ దేశాలు అతి ఎక్కువ నష్టపోయిన దేశాలు. 2014 సంవత్సరంలో మన దేశంలో ఇస్లామిక్ దాడులు 1.2శాతం పెరిగినట్లు ఇంకా పెరుగబోతున్నట్లు విశ్లేషణలు వెల్లడిస్తు న్నాయి. లష్కర్`` తోయ్యిబా, హిజ్బుల్ ముజాహిదీన్ అత్యంత ప్రమాదకర ముస్లిం ఉగ్రవాద సంస్థలుగా పేరెన్నికగన్నవి. ఐతే ఐఎస్ఐఎస్ సంస్థ వీటి రెండిటినీ మించి అతి ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా ఎదిగింది. ప్రపంచ వ్యాప్తంగా 2014లో ఉగ్రవాద దాడుల వల్ల మరణాలు 80% పెరిగాయి. 2013లో 18,111 మంది మరణించగా, 2014 లో ఇది రికార్డు స్థాయిలో 32,658కి ఎగబ్రాకాయి. మనకున్న సమస్యను ఎవరో వచ్చి పరిష్కరిస్తారని ఎదురు చూడటం తెలివితక్కువ ఆలోచన. భారత దేశానికి శక్తి యుక్తి రెండూ పుష్కలంగా ఉన్నాయి. మన సమస్యను మనమే పరిష్కరిం చుకోవాలి. హిందువులంతా నడుంబిగించి అడుగు ముందుకు వేసి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చెయ్యాలి.