కోకకోలా కంపెనీ నీటి దుర్వినియోగంపై వారణాసిలోని ఒక గ్రామ ప్రజల ఆందోళనఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామ ప్రజలు కోకకోలా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. నరేంద్రమోడీ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెహదీ గంజ్ గ్రామ ప్రజలు గ్రామం దగ్గర్లో కోకకోలా కంపెనీ నీటిని విచ్చలవిడీగా ఉపయోగిస్తూ తాము తాగేందుకు నీళ్లు సరిగా దొరకని పరిస్థితులు నిర్మాణం చేస్తుంటే తాగు నీటి కోసం ఆందోళనకు దిగారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక సమస్యగా మారటంతో చుట్టు ప్రక్కల  గ్రామల ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు. కోకాకోలా కంపెనీ అక్కడి నుంచి తీసివేయాలని పొలూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక మెమోరండం ఇచ్చారు. గతంలో కేరళలో కూడా కోకకోలా కంపెనీ వాళ్లు విచ్చవిడిగా నీటిని దుర్వినియోగం చేయడంపై ఆందోళనకు దిగిన విషయంపై ఒక సారి జ్ఞాపకం చేసుకుంటే కోకకోలా కంపెనీ ఎలా సమస్యలు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు.