అశోక్ సింఘాల్జీకి దేశవ్యాప్తంగా ఘనమైన నివాళి

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, అయోధ్య ఉద్యమ రథసారథి అయిన శ్రీ. అశోక్ సింఘాల్ జీ నవంబర్ 17 తేది నాడు ఢల్లీలో తుది శ్వాస విడిచారు. వారికి దేశవ్యాప్తంగా ఘన నివాళి ఇవ్వబడింది. భాగ్యనగర్లో జరిగిన శ్రద్ధాంజలి సభలో శ్రీ.ప్రవీణ్ భాయ్ తొగాడియా ప్రసంగించారు.  ఢల్లీలో జరిగిన కార్యక్రమంలో సరసంఘాచాలక్ మోహన్జీ భాగవత్ ప్రసంగించారు. ప్రసంగాలు సంక్ష్తిప్తంగా....
భాగ్యనగర్ కార్యక్రమము
ఢల్లీలోని రెండు చిన్న అద్దె గదుల కార్యాయంలో ఉన్న విశ్వహిందూ పరిషత్ను విశ్వవ్యాప్తం చేసిన వారు శ్రీ.అశోక్ సింఘాల్జీ. భారతదేశ సమ కాలీన చరిత్ర మలుపు తిప్పిన అయోధ్య ఉద్యమం యొక్క రథసారథి శ్రీ.అశోక్ సింఘాల్. దేశంలోని సాధుసంతులను ఏకం చేసి ధర్మసంసద్ ఏర్పాటు చేసి ధర్మదండం గా దానిని మలిచినవారు శ్రీ.అశోక్ సింఘాల్జీ అని ప్రవీణ్ భాయ్ తొగాడియా కొనియాడారు.
కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ. శ్రీమన్నారాయణ చిన్న జీయర్స్వామిజీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఉగ్రవాదులకు శాంతి కాముకులకు మధ్య యుద్ధం కొనసాగుతున్నది. శాంతి కోసం పనిచేస్తున్న వారిపైనే నిందలు మోపే పరిస్థితి దేశంలో జరుగుతున్నది. శాంతి కాముకులకు విజయం చేకూరేలా మనమంతా కలిసి పనిచేయటమే అశోక్ సింఘాల్ జీకి మనం సమర్పించే నిజమైన నివాళి

సందర్భంగా నవంబర్ 22 తేదిన ఢల్లీలో జరిగిన శ్రద్ధాంజలి సభ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘచాలక్ శ్రీ.మోహన్జీ భాగవత్ మరియు బీజెపి నాయకులు డా మురళీ మనోహర్ జోషి, బీజెపి అఖిల భారత అధ్యక్షుడు అమిత్షా మొదలైన బీజెపి నాయకులు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాద్యక్షులు శ్రీ.ప్రవీణ్ భాయ్ తొగాడియా, ప్రముఖ స్వామి జీలు, మరియు దీదీమా సాధ్వీఋతుంబరా పాల్గొన్నారు. సందర్భంగా సాధ్వీ ఋతుంబరా మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది యువకులను చైతన్య పరి చినవారు శ్రీ.అశోక్ సింఘాల్జీ అని కొనియాడారు.
సందర్భంగా మోహన్జీ భాగవత్ మాట్లాడు తూ అశోక్ సింఘాల్జీ గొప్ప వక్త, సంగీత ప్రవీణ్యు డు. అశోక్ సింఘాల్జీ జీవిత కల. రామ జన్మభూమి స్థలంలో భవ్యమైన రామమందిరం నిర్మాణం చేయ టం. తద్వారా ప్రపంచానికి హిందూ సంస్కృతిని అందించటం అందుకే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణమే వారికి మనం సమర్పించే నిజమైన నివాళి.