మానవ తప్పిదాలే ప్రకృతి వైపరిత్యాలకు కారణమా?గడిచిన నెలరోజులుగా తడిసిముద్దవుతున్నది. చెన్నై నగరం శతాబ్దాలుగా చవిచూడని భారీ వర్షం ఒక్కరోజున ముంచెత్తిం ది. భారీ వర్షాలు, తుఫానులు, తమిళనాడుకు కొత్తకా దు. బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న కారణాన వరదనీరు ముంచెత్తుతూనే ఉంటుంది. కాని ఈసారి అనుభవమువేరు. ఈసారి రెండు తప్పిదాలు స్పష్టంగా కనబడ్డాయి. 1) పాలన యాంత్రాంగం తప్పిదము 2) మానవతప్పిదాలు.
1) చెన్నైలోని చెంబెరుంబాక్కమ్ రిజర్వాయరు నిండి పోవటంతో ముఫ్పైవేల క్యూసెక్కుల నీటిని అడియార్ నదిలోకి అధికారులు వదిలేసారు, నది అంతలోతైనది కాదు. నదీ పరీవాహక ప్రాంతాన్ని మనుష్యులు ఎప్పుడో మింగేసారు. దానితో నదీనీరు చెన్నైపట్టణాన్ని ముంచేసింది.
2) ఒకప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి. మూడు ప్రధాన నదులు కూడా ఉండేవి. వర్షపునీరు కాలువల ద్వారా చెరువులో చేరేది, అక్కడ నుండి నదుల్లోకి చేరేది. తరువాత నీరంతా సముద్రంలో కలిసేది. చెరువు, నదీ పరివాహ ప్రాంతాలన్నీ కబ్జా అయిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పడిపోయాయి. దాని కారణంగా నీరు బయటకు వెళ్ళే మార్గం లేక నగరాన్ని ముంచెత్తుతున్నది. ఆధునికత పేరుతో అన్నీ రకాల విధ్వంసాలు మనంతట మనమే సృష్టించుకొంటున్నాము. పర్యావరణ పరిరక్షణ అందులో ఒకటి.
చెన్నైలో వరదభీభత్స సమయంలోనే పారిస్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణ సదస్సు జరుగుతున్నది. భీభత్సం సదస్సును కదిలించింది. విషయాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాతావరణం రక్షించుకోవటంలో ఇక జాప్యం తగదని హెచ్చరించారు. ప్రకృతికి అనుకూల జీవనం మనం ఎప్పుడో మరిచిపోయాము. విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రకృతికి అనుకూలంగా మనం మారకపోతే మరిన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం చూడవలసి రావచ్చు. మానవ తప్పిదాలను సరిచేసుకోవాలసిన సమయం ఇప్పటికే మించిపోయింది. ఇప్పటికైనా దానిని గుర్తించి ప్రకృతితో సహజీవనం చేద్దాం.