మత స్వాతంత్య్రంలో భారత్‌కు ప్రథమస్థానం
ప్రపంచం అంతా హిందూదేశాన్ని పొగడ్తలతో ముంచి ఎత్తుతూ ఉండగా.. మన దేశంలోని సెక్యులర్ గుంటనక్కలు మాత్రం ఏదో కొంపమునిగిపోయినట్లు ఊళులు వేస్తున్నాయి. జ్ఞానానికి విద్యకు హిందూదేశం పుట్టినిలు అని విదేశాల ఘోషిస్తూ ఉంటే, ‘మనవాళ్ళు ఉత్త వేధవాయిలోయ్అని ఇక్కడి అంగుష్ఠమాత్రపు మేధావులు వాపోతున్నారు.‘వ్యూ` రిసెర్చిసెంటర్అనేది అమెరికాలో ఒక విషయ` సమాచార సేకరణ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వేక్షణలు నిర్వహించి ఫలితాలను నిస్పాక్షికంగా ప్రకటిస్తూ ఉంటుంది. వీరు ఇటీవలమతస్వేచ్ఛఅనే అంశంపై ఒక ప్రపంచ వ్యాప్త సర్వేని నిర్వహించారు. 38దేశాలలో 40,786 మందిని ఇంటర్వ్యూ చేశారు. వివిధ దేశాలో స్పందన విడివిడిగా ఉండగా, భారత్లో మాత్రం 83శాతం మంది ప్రజలుపూర్తి మతస్వేచ్ఛఉందని కుండబద్దలు కొట్టారు. భారతదేశంలో ఉన్నంతసహనంప్రపంచంలో ఇంకెక్కడా లేదనివ్యూ`రిసెర్చిస్పష్టంగా పేర్కొంది. ఐతే  యీ విషయాన్ని మన ఘనత వహించిన మీడియా పట్టించుకోలేదు. కొన్ని దినపత్రికలు మాత్రం క్రొద్ది సమాచారం ప్రచురించాయి. స్త్రీ- పురుషులకు ఉండే అధికారాల ప్రశ్న వచ్చినపుడు కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి వివక్షతలూ ఉండరాదనీ, వారికి సామాజిక అధికారాలు సమానంగా ఉండాలని భారత్లో 71శాతం పేర్కొనగా, ప్రపంచ వ్యాప్తంగా 65% శాతానికన్నా తక్కువ మాత్రమే స్త్రీ అభ్యున్నతికి ఓటు వేశారు. వాస్తవాలు ఇలా ఉండగా భారతదేశం గురించి నీచంగా కొంతమంది సెక్యులర్ వీరులు కూతలు కూయడం వింతగా ఉన్నది.