అతనికి తన తల్లిని చూడడము ఆదే ఆఖరిసారి

ఆ రోజు డిశంబరు 18, 1927. ఒక నడివయస్కు రాలైన స్త్రీ గోరఖ్‌పూర్‌ కేంద్ర కారాగారము ప్రధాన ద్వారము వద్ద వేచియున్నది. ఆవిడ ముఖము ఎంతో కాంతివంతముగానూ ఏదో ఆందోళన కలిగి యున్నట్లుగా యున్నది. కారాగారములోనికి వెళ్ల డానికి వచ్చే పిలుపు కోసమై ఆవిడ వేచియున్నది. ఇంతలోగా ఆవిడ భర్త కూడా అక్కడికి వచ్చారు. ఆయన తన భార్య తన కన్నా ముందే అక్కడ వుండడం చూసి ఆశ్చర్య చకితుడయినాడు. అంతలోనే అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. అతను వారి బంధువు కాదు. కాని ఆ జంటను తను లోపలికి పంపిస్తారని అప్పుడు వారితో కలిసి లోపలికి వెళ్లాలని అక్కడికి వచ్చాడు. జైలు అధికారులు ఆ భార్యాభర్తలను లోనికి పిలిచారు. 

అమరవాణి

శో|| అపరాధోన మేస్తీలి
నైతద్విశ్వాస కారణమ్‌
విద్యతే హి నృశంసేభ్యో


కలియుగ భగీరథుడు

రత్నాగర్భంగా పేరుగాంచిన భరతభూమిలో జన్మించిన ఘనులెందరో. దివి నుంచి పావనగంగాను భూమి మీదకి దించిన భగీరథుని చరిత్ర మనమంత ఎరిగినదే.! కర్నాటకలోని మళనాడు గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌, నీటి కోసం తన తల్లి పడే యాతనలు చూడలేక పోయాడు. 

శక్తికి ప్రత్యామ్నాయం లేదు

దేశ విభజన జరిగినప్పటి నుంచి (1947) పాకిస్తాన్‌ మన దేశానికి పక్కలో బల్లెం చందాన దాపరించింది. గత 70సంవత్సరాల మన ప్రభుత్వాలు నిష్క్రయాతత్వంతో పాకిస్తాన్‌ ఆడింది ఆటగా సాగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. 

ఏకతాటిపైకి హిందూ పీఠాధిపతులు

దక్షిణ భారతదేశంలో తొలిసారి మహాద్వైత, అద్వైత, ద్వైత మార్గాలను అనుసరించే ధర్మ ప్రచారకులంతా ఒకే వేదికపైకి వచ్చి 'హిందూ ధర్మాచార్య ప్రతిషా'న్‌' పేరిట హిందూ ధర్మ పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు.

వకుళమాత గుడి అక్కడే ట్టాలి - హైకోర్టు తీర్పు

ఏడుకొండలవాడి మాత మూర్తి వకుళమాత ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నచోటే పునర్నిర్మించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా, తిరుపతి బైపాస్‌ రోడ్డు పేరూరులో శిథిలావస్థలో ఉన్న వందల ఏళ్లనాటి వకుళమాత గుడిని పునర్నిర్మించాలంటూ 2009లో టీటీడీ చేసిన తీర్మానాన్ని సమర్థించింది.

అనూహ్య స్పందన

హితం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నరేంద్రమోది ప్రధానిగా ఎన్నో సాహసోపేతమైన బాధ్యతలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్‌ భారత్‌లో ''దొంగ నోట్ల'' వర్షం కురిపిస్తూ మన ఆర్థిక రంగాన్ని అతలకుతలం చేయాలని చూస్తోంది.

పడుపు వృత్తి- పసికూనల వ్యాపారం- ముష్టి మాఫీయాల అంతం ఎప్పుడు?

మధ్యయుగాల కాలంలో ముస్లింలు బందీలుగా పట్టుకొన్ని వారిని సంతలలో పెట్టి అమ్మెవారని విన్నాము. ఈ రోజుల్లో కూడా మనుషుల వ్యాపారం సాగుతున్నది అని చెప్పటం నిజంగా సిగ్గుచేటైన విషయం. పశ్చిమ బెంగాల్‌లో ఏళ్ళ తరబడి శిశువుల వ్యాపారం సాగుతున్నది.

మత స్వేచ్ఛకు ముసుగు

శక్తి స్వరూపిణి మహాలక్ష్మీగా పూజింపబడే ఈ మహోన్నత భారతవనిలో నేడు మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయి. అడుగడుగునా అత్యాచారాలు.. అణచివేతలే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఉన్నాయంటే అందుకు కారణం సనాతన హైందవ ధర్మమే అని చెప్పుకోవాలి. కాని అఖండ భారతావనిలోని ఇరాన్‌, అప్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, బలోచిస్థాన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాలుగా ముక్కలు అవుతున్నా కొద్ది ఆ మతాచారాల ప్రకారం మహిళల స్థానం మారుతూ వస్తోంది. అంటే వారు కేవలం మతాచారాలకే పరిమితమవుతున్నారు. 

300 వ్యాధులకు సింపుల్‌ మెడిసిన్‌

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అంతే కాకుండా అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనా లున్నాయిన పరిశోధనల్లో వెల్లడైంది. అసలు 4,5వేల ఏళ్ల నుంచే పూర్వీకులు మునగాకులను మెడిసిన్‌ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.
ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయ
మునగాకులో ఉన్న అద్బుతమైన ఔషధ గుణాలు
మునగాకుల్లో విటమిన్స్‌, ఎమినో యాసిడ్స్‌ మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. 

వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న జీహది మత హింసపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటన

ఇటీవల కాలంలో క్రూరమైన మతహింసలకు పాల్పడుతున్న జిహది శక్తుల వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటలోని రాష్ట్ర ప్రభు త్వాలు ఇలాంటి మతహింస పట్ల కనబరుస్తున్న నిర్లక్ష్యదొరణిని వదిలి తక్షణమే హింసను ప్రేరిపిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకుని జిహది శక్తుల పట్ల గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతుంది.
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల తరువాత నుంచి ఇప్పటి వరకు హిందూవులపై జరుగు తున్న దాడులలో ఎంతో మంది చనిపోవడం, గాయలపాలు కావడం జరిగింది. ఎన్నో గ్రామా లలో హిందూ మహిళాలపై అత్యాచారం, దాడులు, ఆస్తుల విధ్వంసం, గుళ్లల్లో విగ్రహల ద్వంసం కారణంగా తప్పనిసరి పరిస్థితులలో హిందూవులు ఆ గ్రామాలను విడిచిపోవాల్సి వస్తోంది. 

సమకాలిన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోవటమే మన బలహీనత

పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాద మూకలు మరో దారుణానికి ఒడిగట్టాయి. జమ్ములోని నగ్రోటలో సైనిక స్థావరంపై నవంబరు 29న దాడి చేశారు.ఆ క్రమంలో ఏడుగురు జవానులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పోలీసు దుస్తులతో ఆర్మీ ఉన్న ప్రదేశాలలో ప్రవేశించి రెండు భవ నాలలోకి వెళ్లి సైనికులపై కాల్పులు ప్రారం భించారు. ఆ భవనాలలో 12మంది జవాన్లు, ఇద్దరు మహిళలు, నెలల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని రక్షించేందుకు సైన్యం ఆచితూచి పోరాటం చేయాల్సి వచ్చింది. 

మూర్తిభవించిన ఆదర్శం సూరుజీ

శరీరంలో అణువణువును సంఘ కార్యం కోసం సమర్పించిన వారు శ్రీ సూర్యనారాయణరావు. వారు జీవితాన్ని విజయవంతంగా శాశ్వతంగా, ప్
సమాజాన్ని సంఘటితం చేయడంలో 'సేవ' ఒక విశిష్టమై నది అని, ఒక తల్లి పిల్లలకు ఏ విధంగా సేవ చేస్తుందో అదే ప్రేమ, ఆప్యాయతతో మనం కూడా సమాజ సేవ చేయాలి అని ఆయన సరళం గా వివరించే వారు అని తెలిపారు. అలాంటి ఆలోచన, దూర దృష్టి కలిగిన వ్యక్తి. సంఘం ఇప్పుడు లక్ష యాబైవేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించ డంలో వారి పాత్ర ఒక మూల స్తభంలాంటిది అని, వారి మరణంతో దేశం ఒక సామాజిక కార్య కర్తను కోల్పోయింది అని కూడా భాగయ్య అన్నారు.

ఉమ్మడి పౌరస్మృతి - నేటి ఆవశ్యకత

భారతదేశం విభిన్న మతాలకు, వివిధ ఆచారవ్యవహరాలకు ఆలవాలమైన దేశం. అనేక మతాలు, భాషలు, కులాలు, ఆచారవ్యవహారాలు, విశ్వాసలతో కూడిన దేశం. పుట్టుక నుంచి మరణందాకా అనేక సందర్భాలలో వివాహలు, విడాకులు, ఆస్తి వారసత్వము, జీవనభృతి వంటి అనేక విషయాలలో ఇప్పటి దాకా మతవిశ్వాసాల ఆధారంగానే ఆయా మతాల వారికి ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాడ్డాయి

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బందులను సహించి అధిగమించాలి

నవంబరు 8వ తేది నాడు ఉరుము లేకుండా పిడుగుపడ్డట్టు మన ప్రధాని నరేద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించాడు.అది దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చింది. దాని ప్రభావం దేశంలోని సామాన్య ప్రజలనుంచి అసామాన్యుల వరకు అక్రమార్కుల నుంచి అడ్డదారిలో ధనాన్ని కూడాబెట్టే రాజకీయ నాయకుల వరకు అందరిపైన పడింది. ఈ పరిస్థితుల సద్దుమణిగేందుకు కొన్ని నెలలు పట్టేట్లుగానే కనబడుతుంది. 

ఏకశః సంపత ఆంతర్యం

మన స్వయంసేవకులలో ఒకరైన శ్రీనానాజీ దేశ్‌ముఖ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా నుంచి లోక్‌సభకు ఎన్నిక య్యారు. ఆయన గోండా జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధికి ఒక పథకం తయారు చేశారు. ఆ పథకం ప్రారంభోత్సావానికి అప్పటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డిని ఆహ్వానించారు. వారితో పాటు నన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ ఉత్సవం ప్రత్యేకత ఏమంటే, ఆ రోజు భోజనాల సమయంలో రాష్ట్రపతికి ఇటువైపున నేలపైన పట్టాలపై ఒక రైతు, అటువైపు మరో పేద రైతు, వారి ప్రక్కన నేను- ఆ ప్రకారంగానే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు కూర్చోవాలి.

గీతా జయంతి

మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‌-10)  శ్రీకృష్ణభగవానుడు రణరంగమున అర్జునుడికి గీతోపదేశం చేసిన దినము మార్గశిర శుద్దఏకాదశి. కాబట్టి ఈ దిన ము మహాపర్వ దినముగా భావించ బడుచున్నది. భగవద్గీత స్వయంగా భగవంతుడగు శ్రీకృష్ణనిచే అర్జునుడికి బోధించబడినట్లు, అద్వ్తేత జ్ఞానము, అమృతమును వర్షించు నట్టియూ,18 అధ్యాయాలతో కూడినట్టిది. శ్రీ వేదవ్యాసునిచే మహాభారతమందాలి బీష్మ పర్వములో కూర్చబడినది. వేదముల సారము ఉపనిషత్తులు-ఉపనిషత్తుల సారము భగవద్గీత.

దేశం యొక్క మౌలిక విషయాలపై ఏకాభిప్రాయాన్ని సాధించాలి

భారతదేశం స్వాతంత్య్రం పొంది 7దశాబ్దాలు దాటిన తరువాత కూడా ''జాతి- జాతీయత మరియు ధర్మం'' విషయంలో కూడా దేశంలోని ప్రజలంతా ఇంకా ఒక అవగాహన, ఒక సమ్మతికి రాలేకపోతున్నారు. ఈ దేశం యొక్క మౌలిక విషయాలపై ఏకాభిప్రాయాన్ని సాధించాలి.

- శ్రీ దత్తాత్రేయ హోసబలె, సహసర్‌కార్యవాహ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌

నేను భారత అభిమానిని

నేను భారత అభిమానిని. హిందు త్వం, హిందూమతం అన్నా, మోదీ అన్న నాకు గౌరవం. హిందుత్వం నుండి, మోదీగారి ఆచరణ నుండి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

- డోనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా నూతన అధ్యక్షుడు

కాల వ్యవధి సరిగ్గా లేదు

వార్తా పత్రికలు-మీడియా మాద్యముల ద్వారా నేను గ్రహించనదేమిటంటే 80-90% ప్రజలు ప్రభుత్వం చేపట్టిన 'నోట్లరద్దు' చర్యను ప్రశంసిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారి విరోదులు సైతం మోదీ గారి తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా మిమర్శించలేక పోతున్నారు. కాని కాల వ్యవధి సరిగ్గా లేదు, తొందరబాటు చర్య అని ఏక పక్ష నిర్ణయాన్ని డొంక తిరుగుడు అక్కసు వెళ్లగక్కుతున్నారంతే. నైతికంగా ఎవ్వరు కూడా ప్రభుత్వపు సాహసోపేత అడుగుపై సవాలు చేసే సాహసం చేయలేక పోతున్నారు.

- బజరంగ్‌లాల్‌ గుప్త, ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు


మాతృశక్తి సహకారంతోనే పరమవైభవం

రాష్ట్ర సేవికా సమితి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు (నవంబర్‌-11, 12, 13) ''ప్రేరణా శిబిర్‌-2016'' ను నిర్వహించబడింది. దీనికి దేశ నలుమూలల నుంచి 2500 మంది సేవికా సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. శిబిర ప్రాంగణం భారత్‌ యొక్క చిన్నరూపం దర్శనమిచ్చింది. 

చర్చల్లో త్రిపుల్‌ తలాఖ్‌


మా మతాచారాల్లోకి ఎవ్వరి జోక్యాన్ని సహించమంటూ ఇస్లామిక్‌ సంస్థలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మహిళలు తమకు కూడా పురుషులతో సమానంగా మసీదులు, దర్గాల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తమ భర్తలు తలాఖ్‌... తలాఖ్‌... తలాఖ్‌ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇచ్చే విధానాన్ని రద్దుచేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు.   పూర్తిగా చదవండి


మావి మాకే.. మీ వన్నీకూడా మాకే..!


జంతుశాస్త్రం ''పరాన్న భుక్కులు'' అనే జీవుల గురించి ప్రస్తావన చేస్తుంది. ఇటువంటి వారు మనుషులలో కూడా ఉన్నారు. మనుషులు అవయవ దానం చేయడం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. కానీ! ఎవరు దానం చేస్తున్నారు... ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అని ఎప్పుడు మనం ఆలోచించాం.   పూర్తిగా చదవండి


దుష్ప్రచారం మిధ్య! సరస్వతి సత్యం

హర్యానా ప్రభుత్వం నియమించిన ఒక నిపుణుల సంఘం సుధీర్ఘంగా పరిశోధనలు జరిపి సరస్వతీ నది ఒకప్పుడు ఉండేదని సంఘం అధ్యక్షుడు మరియు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు పద్మభూషణ్‌ కె.ఎస్‌.వైద్య ధ్రువీకరించారు.