ఎందరికో స్పూర్తి - కీర్తి

అనాగరిక సమాజం నుంచి నాగరికతపైకి విస్తరిస్తున్నాం. అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట మహిళలపై దురాచారాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళను శక్తిగా కొలిచిన మనదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. కొన్ని రాష్ట్రాలో ఇప్పటికీ బాల్యవివాహం అనే రాక్షసి రాజ్యమేలుతోంది. రాజస్థాన్ రాష్ట్రం ప్రకృతికీ వీర గాధకు పెట్టింది పేరు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అక్కడే చైల్డ్ మ్యారేజెస్ సంఖ్య ఎక్కువ. పసిపిల్లలకు పెళ్లిళ్లు చేసే సంప్రదాయానికి వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నా  అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. బాల్యవివాహం అరికట్టాలనే ఆలోచన 28 ఏళ్ల కీర్తి భారతికి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలని అనుకుంది. తనకు తెలుసు ఇలాంటి కార్యక్రమాలను చేస్తే ముందుగా ఎన్ని ఒత్తిళ్లు అవాంతరాలు వస్తాయో. వాటన్నింటికీ భయపడకూడదనుకుంది. అనుకున్నట్లుగానే చాలా మంది చంపేస్తామంటూ బెదిరించారు. అయినా సరే వాటన్నింటినీ ఎదుర్కొంది వారిని కోర్టుకీడ్చింది. ఆమె చేసిన కృషి  వల్ల అక్కడ బాల్యవివాహలను అడ్డుకోవడంతో పాటు బాలికకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ 29 బాల్యవివాహలను అడ్డుకుని, 850 మందికి పైగా బాలికలకు పునరావాసం కల్పించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది కీర్తి.

తను కూడా బాదితురాలే..
కీర్తి భారతి కూడా చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆమె తండ్రి డాక్టర్. కానీ కీర్తి కడుపులో ఉండగానే అమ్మానాన్న విడిపోయారు. దాంతో కీర్తిని కడుపులోనే చంపేయాలని ఆమె తల్లి తరుపు బంధువులు బలవంతం చేశారు. ఆమె తల్లి వినలేదు. కీర్తి పుట్టిన తర్వాత కూడా ఆమెను చంపాలని విష ప్రయోగం చేశారు. దీంతో కొన్నిరోజులు ఆమె చదువుకు దూరం అయింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కున్న కీర్తి వీటన్నింటికీ కారణం అమ్మాయిు చదువుకు దూరం కావడం, వారికి తగిన సంక్షేమం దొరకక పోవడమే అని గ్రహించింది. అందుకోసం రాజస్థాన్లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా పోరాడి ఆరువేల మంది ప్లికు, 5,500 మంది మహిళకు పునరావాసం కల్పిస్తోంది.

సాయం కోసం సారథి ట్రస్ట్..
అరాచకాలకు ఫుల్ స్టాప్ పడాలనే కీర్తి 2011లో సారథి అనే ట్రస్టు ప్రారంభించింది. సంస్థ ఏకైక లక్ష్యం మహిళలకు సామాజిక న్యాయం జరిగేలా చూడటమే. బాల్యవివాహలను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నంలో చాలాసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టారు. సంస్థ బాధ్యత కేవలం బాల్యవివాహలను అడ్డుకోవడమే కాదు, తర్వాత వారికి మరింత మెరుగైన జీవితాన్ని ప్రసాదించడం కూడా . ట్రస్ట్ ద్వారా  బాలికకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నది. తర్వాత వారిలో ధైర్యం నింపేందుకు రిహాబిలిటేషన్ వంటివి కూడా చేపడుతున్నది. సారథి ట్రస్ట్ ఇప్పటివరకు 29 బాల్యవివాహలను రద్దు చేయించింది.  ఆమె సూర్తిదాయకమైన కథని సీబీఎస్ విద్యా ప్రణాళికలోనూ చేర్చారు. ఇంత సాధించినా కీర్తి పొంగిపోలేదు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని- తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అంటారు.అవును నిజంగానే మహిళ తలుచుకుంటే తనతో పాటు తమ కుటుంబాన్ని సమాజాన్ని కూడా మార్చగలదు. అందుకోసం కొంచం ధైర్యం, శక్తి, యుక్తులు సంపాదించుకుంటే చాలు.