దాచినా దాగని నిజంభారతదేశంలో సత్యం రాజ్యమేలుతున్నది హిందువులు దొంగతనాలు చేయరు, ఇంటికి తాళాలు వేసుకోరు హిందూదేశం లో అడుక్కునేవాళ్ళులేరుఅని ఒక సందర్భంలో లార్డ్మెకాలే వ్యాఖ్యానించాడు. కాని వీరసెక్యులరిస్టులు మాటను హేళన చేశారు. శని సింగణాపురం, మహారాష్ట్ర, నగర్ జిల్లాలో ఒక గ్రామం, శంభాజీనగర్ పట్టణానికి 90 కి.మీ. దూరంలో ఉన్నది. గ్రామంలోశనిదేవుడు కొలువు తీరి ఉన్నాడు. కారణంగా ఇక్కడ నేరాలు జరుగవు. ప్రజలు ఇళ్ళకు తలుపులు వేయరు-తాళాలు వేయరు. గ్రామంలో 03-09-2015 నాడు, మహారాష్ట్ర అంతరంగికశాఖ మంత్రి రామ్షిండే ఒక పోలీసు స్టేషన్ను ప్రారంభోత్సం చేశారు. అయ్యా! మీరు నమ్ము తారో లేదోకాని, ఒక వాస్తవాన్ని పోలీసు సబ్ ఇన్స్పెక్ట ర్ వైభవ్ పెటేకర్ నోటి వెంటే వినండిశనిదేవుడు ఉన్న ఊరులో ఎవ్వరూ తులుపులకు తాళాలు వేయరు, మా పోలీసు స్టేషన్లో కూడాలాకప్కు తాళాలు ఏర్పాటు చేయలేదు. ప్రక్కగ్రామంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలుగా 15 నేరాలు జరిగాయి. శనిసింగణాపురంలో ఒక్క నేరం కూడా జరుగలేదు మాటు సాక్షాత్తూ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ వైభవ్ చెప్పినవి.