ఆర్యుల గురించి ఏ వేదంలో ఉంది? : హితవచనం

యూరప్ వాసులకు అవకాశము లభించిన తావులోని మూలవాసులను నిర్మూలించి వారి భూములపై అనాయస ముగా నివాసము  ఏర్పరుచుకొందురు. కావున భారతదేశంపై దండయాత్ర చేసిన ఆర్యులు అట్లే చేసి ఉందురనివారి తలంపు. పాశ్చాత్యులు వారి స్వగృహము లందే ఉండి వారికిగల ఆధారము మీదనే నివశించిన యెడలవారు నిర్భాగ్యులుగాను, నీచులుగాను పరిగణింపబడురు. కావున వారు లోకమంతము వెర్రియెత్తినట్ల తిరిగి ఇతరుల భూములను దోపిడీచేతను, మరణక్రియచేతను అపహరించుటకు చూతురు. ఆర్యులు అట్లే చేసి ఉందురని వారి ఊహ. ఆర్యులు ఇక్కడికి వచ్చారు అనే దానికి మీ దగ్గర ఆధారము ఏమీ ఉన్నాయి, అవి ఊహలు మాత్రమే. మీ వింత ఊహాలు మరి మీరే ఉంచుకొనుడు. విదేశము  నుండి ఆర్యులు హిందు దేశమునకు వచ్చిరని వేదమున, సూక్త మున ఉన్నది? మృగప్రాయులై ఉన్న ఆదివాసులకు వారు వధించిరను భావమును ఎక్కడ నుండి సంపాదించారు? అట్టి అర్థరహిత ప్రేలాపము చేయుట వలన మీకేమీ లాభము కలుగును? మీ యూరప్ దేశీయుల గమ్యము తాము జీవించుటకొరకు ఇతరు నెల్లరును నిర్మూలించుట. హిందూ జాతి గమ్యము ఎల్లరును తమ ఉన్నతికి లేక ఇంకను అధికతరోన్నతికి ఉద్ధరించుట అటువంటి ఆదర్శం తమైన జాతి మనది.
-స్వామి వివేకానంద