ప్రపంచానికి హిందువుల నేతృత్వంహిందువులు జాగృతమైతే.. ప్రపంచం మొత్తం జాగృతమవుతుంది. జాగృతి.. మానవ స్వేచ్ఛను పాదుగొలుపుతుంది. జాగృతమైన హిందూ వర్గం.. శాంతి, సామరస్యం, సంతోషాలతో ప్రపంచానికి నేతృత్వం వహించగలదు. హిందువులుగా మేం.. మా ఆలోచనతో ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచాన్ని బానిసగా చేయాలని కోరుకోవడం లేదు. అదే సమయంలో మేం ఎవరినీ ధ్వేషించాలని కూడా అనుకోవడం లేదు. హిందువుల జీవన విధానం, వారి చర్యలు ప్రతి ఒక్కరినీ ప్రేమించేవే. భారత్ను హిందూత్వాన్ని కాపాడుకోవాలని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. ఎప్పటికప్పుడు ఏవో సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ మన తత్వంపై మనకు పూర్తి నమ్మకముండాలి.
-సురేష్ భయ్యాజీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి