అమెజాన్‌లో ఆవుపిడకల అమ్మకంఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పుడు ఆన్లైన్లో యమ డిమాండ్. ‘అమేజాన్షాస్క్లూస్ వంటి పోర్టల్స్లో ఇప్పుడు ఆవుపిడకలకు అందుబాటులో ఉన్నాయి. ఢల్లీకి చెందిన ఆసియా క్రాప్డ్స్ యజమాని ప్రతీకర్లాకు టివి ఛానల్లో ఒకరోజు స్వామీ ఆవుపేడపిడకను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పటంతో ప్రీతికి చటుక్కున ఆలోచన వచ్చింది. ఢల్లీ శివారులోని గ్రామాల నుంచి ఆవు పేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టింది. ఒకొక్కరు ఒకొక్క సైజు చేస్తుంటే ప్యాక్ చేయటం కష్టమైపోయింది. దానితో తనే స్వయంగా ఊరిలో సొంతంగా పిడకల తయారినీ చేపట్టింది. 8 పిడకలకు ఒక ప్యాక్. అట్లాంటివి నెలకు 3,000 ప్యాకెట్లు అమ్ముతున్నది. విదేశాల్లోని హిందూ ఆలయాల నుండి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. క్రమంగా వ్యాపారం విస్తరిస్తున్నది. ఆమెజాన్లో విశేషంగా అమ్ముడుపోతున్నది.