పార్లమెంటు ప్రతిష్ఠంబన 

ఈసారి శీతాకాలసమావేశాల్లో ఎక్కువగా ఎగువ సభలో ప్రతిష్ఠంబన జరిగింది. లోక్సభ 115 గంటలు, రాజ్యసభ 57 గంటలు పనిచేసింది. లోక్సభలో సమయం వృధాకాలేదు. రాజ్యసభలో 55గంలు వృధాఅయింది. లోక్సభ లో 14 బిల్లులు, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం పొందాయి. వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షం స్తంభింపజేసింది. ఎన్డిఎపై అర్థం పర్థంలేని అవినీతి ఆరోపణలు చేసి యుపిఎ, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగకుండా అడ్డుకున్నాయి. విలువైన ప్రజాధనం దుర్వినియోగమైంది. కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం హాడావుడిగా భూసేకరణ చట్టంపై ఆర్డినెన్స్ తేవడం ఒక కారణమైతే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిపథంవైపు వెళ్ళకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ వ్యూహం. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, జనతా దళ్, రాష్ట్రీయ జనతాదళ్న్నీ కలిసి పోటీచేసి ఎన్డిఎపై విజయం సాధించాయి. కాంగ్రెస్ బలం 4 నుంచి 24 సీట్లకు పెరిగింది. మళ్ళీ కాంగ్రెస్ రగడ ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో 2013లో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన ప్రజాహిత వ్యాజ్యం మీద న్యాయస్థానం సోనియా, రాహుల్పై పట్టుబిగించి న్యాయస్థానంలో హాజరుకావడం గురించి ఇదంతా ప్రధానమంత్రి కుట్ర అని ఆరోపిస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా జరుగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది. ప్రజోపకరమైన బోనస్ బిల్లులు, ఎన్సిఎన్టి బిల్లులు, వంటివి పాస్కాకుండా ప్రజాస్వా మ్యాన్ని జనస్వామ్యా నికి దిగజార్చుతున్న కాంగ్రెస్పార్టీ పన్నాగం కనిపెట్టలేనంత పిచ్చి వాళ్ళు కాదు ప్రజలు. ఏకంగా తమ మామగారి మానసపుత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తులకే ఎసరు పెట్టిందంటే సోనియాగాం ధీకి, కొడుక్కి మించిన గుండెలుదీసిన బంట్లు మరొకరుండరు. పైగా నెహ్రూ 125 జయంతోత్సవాలు చేస్తూ మోడీ ఫ్రభుత్వాన్ని నెహ్రూ గౌరవం దిగజారుస్తున్నదని నిందించడం కాంగ్రెస్ మార్కు రాజకీయానికి అద్దం పడుతున్నది. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుని సమావేశాలు నడపాలని కొందరన్నారు. అందు కోసం ఈసారి మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది కూడా. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కాంగ్రెస్ నాయకులందరితో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తప్ప అందరూ బిల్లును సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు కోరుతున్నది. నిజానికి శ్రీ.ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా వున్నపుడు జియస్టి బిల్లులో ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న సవరణలు లేవు. కేవలం ఏదో ఒక సాకుతో పార్లమెంటు జరగకుండా చూడాలన్నది కాంగ్రెస్ వ్యూహం. పంజాబ్ సమస్య మీద ఒకరోజు, అస్సాం మీద ఒకరోజు ఇలా ఏదో ఒక కారణంతో పార్లమెంటు బయట ధర్నాలు నిర్వహించింది. కాని అసలు కారణం తమపై వచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసును మాఫీ చేయించుకునేందుకే అని జనానికి తెలిసిపోయింది. నైతికంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. 50లక్షల ఒక డొల్ల కంపెనీలో పెట్టుబడి పెట్టి రూ.5000 కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నింది. తల్లీకొడుకులిద్దరూ కోర్టులో హాజరై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. పైగా తాను ఇందిరకో డలినని, ఎవరికీ భయపడనని సోనియా చేస్తున్న బెదిరింపు, తాను చట్టానికి అతీతురాలినని గొప్పులు చెప్పడం తప్ప మరొకటికాదు.