నేపాల్‌తో వివాదంప్రధాని శ్రీ మోదీ నేపాల్‌తో సంబంధాల విషయంలో మొదటి నుంచీ శ్రద్ధకనబరుస్తున్నారు. సమయం, శక్తి వనరులు ఇవన్నీ నేపాల్‌కు సమకూరుతున్నాయి. నేపాల్‌లో గత ఏప్రిల్‌లో భూకంపం సంభవించినపుడు భారత్ తక్షణం స్పందించి అనేక రోజులపాటు సహాయమందించింది. నేపాల్‌లో కొత్తగా ఆమోదించిన రాజ్యాంగం భారత్ కోరుకున్నట్లుగా లేకపోవడమే ప్రస్తుత వివాదానికి కారణమైంది. నేపాల్‌లో నివసిస్తున్నమాధేశిజనజాతి జనాభాను కూడా సమానపౌరులుగా గుర్తిస్తూ, రాజ్యంగంలో పొందుపరచమని మోడీ ప్రభుత్వం ఇచ్చిన సలహాను నేపాల్ ప్రభుత్వం పెడచెవినపెట్టింది. దీనివల్లనే హింస జరిగింది. భారత్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం ఇరుదేశాల మధ్య ఘర్షణను పెంచుతుందని, నేపాల్‌ను చైనాకు దగ్గర చేస్తుందని కొందరి అభిప్రాయం. భారత్ నుండి సరఫరా అయ్యే డీజిల్ వంటి ఇంధనానికి కొరత ఏర్పడింది. సరిహద్దుల్లో జరుగుతున్న అడ్డగింపే ఇందుకు కారణం. సెప్టెంబర్ 20, 2015 నాడు నేపాల్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేపాల్‌లో ప్రజా ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాని నేపాల్ ప్రభుత్వం అందులో ఉన్న మంత్రులు ఇవి భారత వ్యతిరేక ప్రదర్శనలం టున్నారు. ఇంధనం కొరత వల్ల భారత వ్యతిరేక నినాదాలు వినపడ్తున్న మాట వాస్తవం. సరిహద్దుల్లో వున్న మాధేశి జనజాతి వర్గాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనతో భారత్‌కు సంబంధంలేదని, భారత్ నుంచి ఇంధన సరఫరాలో లోపం లేదని భారత్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. సుమారు 40 మంది మాధేశి జనజాతి ప్రజలు ఘర్షణల్లో చనిపోయారు. రాజ్యాంగం తమ హక్కును హరించి వేస్తున్నదని వారంటున్నారు. వేలాదిగా ట్రక్కులు భారత సరిహద్దుల్లో నిలిచిపోయాయి. సమస్య పరిష్కార దిశగా మోడీ ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం రాజ్యంగ సవరణకు సిద్ధమయ్యింది. వివరాలు తెలియాలి. బంగ్లాదేశ్‌తో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదం మోడీ ప్రభుత్వం పరిష్కరించగలిగింది. పొరుగుదేశాలతో సత్సంబంధాల విషయంలో ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తరుణంలో ఇరు దేశాలు పట్టువిడుపు ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవడం ఉభయతారకమవుతుంది. ఉపఖండంలో శాంతి, సామరస్యాకు ఇది దోహదపడుతుంది.