పులకించిన తెలుగునేల - వైభవోపేతంగా అయుత చండీ మహాయాగం

తెలుగు నేలపై మహోత్కృష్ట ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత అరుదైన యాగానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వేదికైంది. అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా జరిగింది. వేలాది మంది రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల  ఘోషతో... అతిరథ మహారథుల సమక్షంలో యాగం యావత్తూ వైభవోపేతంగా సాగింది.