ఆర్యుల గురించి ఏ వేదంలో ఉంది? : హితవచనం

యూరప్ వాసులకు అవకాశము లభించిన తావులోని మూలవాసులను నిర్మూలించి వారి భూములపై అనాయస ముగా నివాసము  ఏర్పరుచుకొందురు. కావున భారతదేశంపై దండయాత్ర చేసిన ఆర్యులు అట్లే చేసి ఉందురనివారి తలంపు. పాశ్చాత్యులు వారి స్వగృహము లందే ఉండి వారికిగల ఆధారము మీదనే నివశించిన యెడలవారు నిర్భాగ్యులుగాను, నీచులుగాను పరిగణింపబడురు.