బురదలోనుండి ఉద్భవించిన ఆణిముత్యం
బరోడా మ్యానేజ్మెంట్ అసోసియేషన్ వారు వడోదరా(గుజరాత్)లోనిహోటల్గేట్వేలో ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సన్మాన గ్రహీత టాటా సంస్థ అధిపతి రతన్‌టాటా. ‘సాయాజీరత్నపురస్కారాన్ని అందుకున్న తరువాత రతన్ టాటా క్రొద్దిసేపు ఆహూతులతో ముచ్చటించారు. అప్పుడు ఒక విద్యార్థి టాటాను ఇలా ప్రశ్నించాడు. ‘టాటాగారూ! మన రాజకీయ రంగం పూర్తిగా కలుషితమైపోయింది. రాజకీయ నాయకులు అంటే దొంగలు అని ప్రజలు అనుకుంటున్నారు. వాతావరణంలో మీరు రాజకీయ నాయకుడితోనైనాటీ పార్టీచేసుకోవటానికి అంగీకరి స్తారా? అని ప్రశ్నకు రతన్‌టాటా ఇచ్చిన సమాధా నం..‘వెగటు పుట్టించే ఈనాటీ రాజకీయం అంటే నాకు రోత! కానీ రాజకీయాలలో ఒక్క నరేంద్రమోడీ నీతిపరుడు, మాటనిలబెట్టుకునే నాయకుడు, కార్యదక్షుడు. మేము నానో కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు కేవలం మూడు (3) దినాలలోనే మాకు కావలసినంత స్థలాన్ని సేకరించి ఇచ్చిన నాయకుడు మోడీ. అతడితో టీ త్రాగడమే కాదు, నేను మోడీతో కలిసి గాలిపటాలు కూడా ఎగుర వేశాను. రాజకీయ క్మశంలో కూడానీతిఉందని నిరూపించాడు మోడీఅన్నారు రతన్‌టాటా.