ఉడుత సహాయందానకర్ణుడు, శిబిచక్రవర్తి, రంతిదేవుడు జన్మించిన దేశం హిందూ దేశం. ఆర్థికశక్తితో నిమిత్తం లేకుండా దానగుణం కలిగినవారు మన హిందువులు. మనం ఇచ్చిన డబ్బుతో కోటీశ్వరులైన షారుఖ్ఖాన్లు, యూసుఫ్ఖాన్లు, అమీర్ఖాన్లు ఒక్క చిల్లిగవ్వకూడా దానం చేయని సమయంలో, ముంబైలో బజ్జీలు అమ్ముకునే ఒక సామాన్యుడు చేసిన వితరణ ఇది. మంగేశ్ అహివాలే (38) ముంబైలో బజ్జీలు అమ్ముకునే ఒక చిరువ్యాపారి. ఇటీవల చెన్నైలో సంభవించిన తీవ్రవరదలు అక్కడి ప్రజల ఇక్కట్లు చూచి చలించిపోయిన ఇతడు తన శక్తికి మించి ఇరువది వేల రూపాయలు (20,000) వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్వారా అందజేశాడు. పేద కుటుంబానికి చెందిన మంగేశ్ సంపాదన మాత్రమే కుటుంబానికి ఆధారం. ముంబై బస్సు కంపెనీలో కార్మికుడుగా పనిచేసే మంగేశ్ తండ్రి కూడా దానధర్మాలు చేసేవాడు. ఎంత ధనం ఉన్నది అనికాదు, దానగుణం ఎంత ఉన్నది అనేది ముఖ్యం.