దూరాక్రమణదారు సిద్ధాంతాన్ని వదిలించుకోవాలి


మధ్య పార్లమెంటు సమావేశాలలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే ప్రసంగానికి అడ్డు తగులుతూ మీరందరూ ఆర్యులు, ద్రావిడులను అణిచివేసిన వారు అని అరవటం మొదలుపెట్టాడు. అట్లాగే ఒక దక్షిణ భారతదేశ రాజకీయ నాయకుడు తన స్నేహితుడైన ఉత్తరభారత నాయకుడిని మీరంతా దురాక్రమణదారులైన ఆర్యులు అని అన్నాడు. అర్య-ద్రావిడ సిద్ధాంతము తలకెక్కించుకొన్న మన మేధావులు బ్రిటిష్ వాళ్ళు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఇటువంటివారు మన నాయకులు. ఇటువంటి వారు ఉండబట్టే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి అరునది ఎనిమిది సంవత్సరాలు (68) అయిన వాళ్ళనే అనుకరిస్తూ దేశంలో విభేధాలు సృస్టిస్తూనే ఉన్నారు. ఆర్య-ద్రావిడ సిద్ధాంతము తమ దురాక్రమణను సమర్థించుకోవటానికి బ్రిటిష్వాళ్ళు వండి వార్చిన సిద్ధాంతము. సిద్ధాంతాన్ని ఇంకా వదిలిపెట్టకపోవటమే మన దుస్థితి.