యాహూ మేటి వ్యక్తిగా గోమాతప్రముఖ ఐటీ సంస్థ యాహూ గోమాతను 2015 క్యాలెండర్ సంవత్సరానికిగానూ మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక మంది యాహూ సెర్చ్ ఇంజన్లో గోవు యొక్క విశిష్ఠత గురించి తెలుసుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్పై నిషేధం విధించటం, దాద్రి ఉదంతం, కర్ణాటకలో గోవును కాపాడే క్రమంలో ప్రశాంత్ పూజారీ అనే యువకుడు ముష్కరుల చేతిలో దారుణంగా హత్యగావింపబడటం, గోహత్యా రాజకీయాల  ద్వారా ప్రతిప క్షాలు అదే పనిగా పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం మొదలైన అంశాలు.. ఆవు విశిష్ఠత ఏమిటో తెలుసుకునేందుకు అత్యధికులను పురిగొల్పినట్లు తెలుస్తోంది.