పరస్పర సంబంధాలకు భారత్‌ సిద్ధమే మారని పాక్‌ నైజమునరేంద్రమోదీ రష్యా పర్యటన ముగించుకొని డిసెంబర్ 25 ఆప్ఘనిస్తాన్లో భారత్చే నిర్మించబడిన ఆదేశ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి ముందస్తు ఏర్పాట్లు ఏవీలేకుండా లాహోర్లో దిగారు. నవాజ్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి, నవాజ్ షరీఫ్ మనుమరాలి వివాహంలో పాల్గొని ఢల్లీకి తిరిగి వచ్చారు. లాహోర్లో దిగటం రెండు దేశాల మధ్య చర్చకు తగిన వాతావరణం నిర్మాణం చేయటం కోసము..
పాకిస్తాన్కు వెనుదన్నుగా ఉండే అమెరికా, ఇంగ్లాండు లాంటి దేశాలకు భారత్లో ఉదారవాద మేధావులకు పాకిస్తాన్ ఎటువంటి దాడులు చేసిన ఏమి చేసిన పాకిస్తాన్తో చర్చలకు భారత్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తూ ఉంటారు. పాకిస్తాన్ సరిహద్దులలో తుపాకులు మ్రోగిస్తూన్న భారత్ మాత్రం చర్చకు తలుపులు తెరిచి ఉంచాలని అంటూ ఉంటారు. దానికి ఎప్పుడైన సిద్ధమని నరేంద్రమోదీ చెప్పకనే చెప్పారు. మొన్న లాహోర్లో స్నేహపూర్వకంగా కలిస్తే దాని ఫలితం పంజాబులోని సైనిక విమానాశ్రయంలోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ధ్వంసం చేయటం లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి జరిగింది. హోరా హోరీ పోరాటంలో ముగ్గురు జవానులు, నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇది పాకిస్తాన్ నైజము.
పాకిస్తాన్ దేశం ప్రజాస్వామ్య దేశమేకాని పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతులో కీలుబొమ్మ. పాకిస్తాన్లో ఉగ్రవాదతండాకు పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహం మాత్రమే కాదు ఉగ్రవాదులను నడిపించేది పాకిస్తాన్ సైన్యం. ఇది జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ సైన్యానికి భారత్తో శతృత్వమే కావాలి. పాకిస్తాన్ లక్ష్యాం 1) భారత్లో మిగిలి ఉన్న కాశ్మీర్ను పాకిస్తాన్లో కలిపేసుకోవటం 2) భారత్లో మిగిలి ఉన్న పంజాబులో కల్లోలాలు సృష్టించటం. దాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ దాచుకోలేదు. 1948 నుండి ప్రత్యక్షం గానో, పరోక్షంగానో దాడులు చేస్తూనే ఉన్నది. దాడులలో వేలమంది సైనికులు, సామాన్యపౌరులు ఇప్పటికే బలైనారు. ఉచిత సలహాలు ఇచ్చే మనదేశ ఉదారవాద మేధావులు, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు దాడులు జరిగినప్పుడు ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చి దులిపేసుకొంటారు.  దశాబ్దాలుగా సాగుతున్నది ఇది. పాకిస్తాన్ విషయంలో ఇకనైన కఠినవైఖరి తీసుకొని దేశ సార్వభౌమత్వం కాపాడటానికి సిద్ధం కావాలి.