‘హిందుత్వం’ సమిష్టి విజ్ఞానం సనాతనం: సుప్రీంకోర్టు


డిసెంబర్ 16 భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక ప్రముఖమైన పుటను లిఖించిన రోజు. భారతీయు ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక నిజమైన ఆత్మను ఆవిష్కరించిన రోజు. రోజున భారత సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడులోనిఆదిశైవ శివాచార్యనా సంఘంవారు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణ చేస్తూ ఇద్దరు సభ్యులు గల ధర్మాసనం దేశంలోని అధిక సంఖ్యాకులు అనుసరిస్తున్న హిందూత్వానికి విస్తృతార్థంలో వ్యాఖ్యానించింది.
కేసు పూర్వపరాలను పరిశీలించినట్లైతే తమిళనాడులోని దేవాలయాలలో అర్చకుల నియామకము ఆగమశాస్త్రాలకు అనుగుణంగానే నియమించడాన్ని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2006లో ఉత్తర్వులు జారీచేసింది. ఇది రాజ్యాంగంలో పొందుపరిచినసమానత్వానికివ్యతిరేకమని పేర్కొంది. కాగా దీనిని సవాలు చేస్తూ తమిళనాడులోనిఆదిశైవ శివాచార్యనా సంఘంవారుసర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు.
కేసును విచారణ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంఆగమ శాస్త్రాలకు అనుగుణంగా దేవాలయాలలో అర్చకులను నియమించడం రాజ్యాంగసమానత్వసూత్రానికి భంగకరమా? కాదా? అన్న అంశంపై న్యాయమూర్తులు రంజన్గోగోయ్, ఎన్.వి.రమణ వివరణ ఇచ్చారు.  ఆగమశాస్త్రాలకు అనుగుణంగా అర్చకులను నియమించడం సమానత్వ సూత్రానికి భంగకరం కాదు అని మాత్రమే చెప్పారు. అట్లాగే హిందూత్వం గురించి ఇచ్చిన వివరణ కూడా చారిత్రక వాస్తవాలకు అనుగుణంగా వుంది. హిందూత్వంపై వ్యాఖ్యానిస్తూఇది ఒక్కరు స్థాపించి నది కాదు. హిందూత్వం ఒకే ధర్మగ్రంథానికిగాని, ఒకే శాస్త్రానికి గాని, ఒకే ఆగమానికి మాత్రమే పరిమితం కాదు. ఒకే ఆలోచన రీతికి సంబంధించిన ప్రభో దానికి నిబద్ధమైలేదు. దీన్నే సనాతన ధర్మమని అభివర్ణించారు. అంటే శాశ్వతమైన ధర్మం. హిందూత్వం శతాబ్దలు తరబడి వికసించిన విజ్ఞాన రీతు, ప్రేరణ సమిష్టి సమాహారం విజ్ఞానమే హిందూత్వంగా ప్రచారమైంది. విస్తరించిది. అని న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. హిందూత్వ సనాతన శాశ్వత తత్వాన్ని ఉటంకించటం ద్వారా హిందూత్వం గురించి జరుగుతున్న వక్రీకరణలు, భ్రమలను, భ్రాంతులను తొలగించినట్లైంది. హిందూత్వ జీవన విధానంలో అనేక వైవిధ్యాలు భాగమైనాయి. వాటిలో మతవైవిధ్యాలు, భాషా వైవిధ్యాలు, సాంప్రదాయ వైవిద్యాలు విజ్ఞాన వైవిధ్యాలను అనాదిగా తమలో ఇముడ్చుకొని పెంపొందించిన అస్తిత్వం హిందూ మౌలిక జీవన విధానం. హిందూత్వం ఒక విశ్వాసాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలనికాని, ఒక విశ్వాసాన్ని మాత్రమే తొలగించాలనికానీ సూచించదు. వాస్తవానికి కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో జరిగింది తమిళనాడుకు సంబంధించినదైనప్పటికీ, న్యాయమూర్తులు హిందూత్వంపై చేసిన వ్యాఖ్యానము మొత్తం దేశానికి సంబంధించి తరతరాల జాతీయ జీవని విధానానికి సంబంధించినవి. హిందూత్వం సనాతనం. సనాతనం అంటే పాతదిని అర్థం కాదు. సనాతనం అంటే నిరంతరం ఉండేది అని అర్థం.  హిందూత్వం ఒక మతం కాదని, అదొక జీవన విధానమని గతంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హిందూత్వం ఒక మత విశ్వాసానికే పరిమితం కాదు. శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, స్కాంధ, బౌద్ధ, జైన, శిక్కు, చాణక్య, ఆర్య సమాజ్వంటి అనేకమైన వివిధ మార్గాల విశ్వాస పరుకు జీవన విధానంలో సమ్మిళిత మైనాయి. వైవిద్య సహిష్ణుత కారణంగానే ఇతర దేశాలనుండి ఇస్లాం, క్రైస్తవ, యూదు పారశీక మతాలు దేశంలో విస్తరించగ లిగాయి. శతాబ్దాల చరిత్ర ఇందుకు సాక్ష్యం. అన్ని విశ్వాసాలకు, నమ్మకాలకు ఆలవామైన హిందూమతం ఒక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ధ్వంసం చేయలేదు. సమ భావంతోనే సకల వైవిద్యాలు హిందూత్వం సనాతనత్వాన్ని సంతరిం చుకుంది. సర్వోన్నత న్యాయస్థాన వ్యాఖ్యానంతోనైనా దేశంలోని కుహానా సెక్యులరిస్టులు, హిందూ మతవిశ్వాసంపై పదే పదే తప్పుడు ప్రచారాలతో దాడి చేస్తున్న వామపక్ష భావజాలపు కుహానా మేధావులు కళ్ళు తెరవాలి. హిందూ జాతీయ వాదంతోనే దేశానికి శ్రీరామ రక్ష అనే జాతీయ వాదాన్ని బలపర్చాలి.