ఈ నేలంతా భారతమాత గానమే

వంద సంవత్సరాల పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15 మనం మన దేశానికి స్వాతంత్య్రం సంపాదిం చుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం.  రోజున మన తల్లి అయినటు వంటి భారతమాతను పూజించాలి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మనజాతిలో సమైక్యతకు సాంస్కృతిక ఏకత్వానికి ప్రపంచానికి ఒన నమూనాగా భారత్ నిబడి ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి, ప్రేరణ భారత మాత పూజ నుండి మనం పొందాలి.
ఉన్న ఊరు కన్న తల్లి అనేది మన నానుడి. మనకు జన్మనిచ్చిన తల్లిలాగా మనం జన్మించిన భూమి కూడా మనకు తల్లే అంటుంది వేదము. ఎందుచేత? కన్నబిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు. బిడ్డ అవసరాలు కనిపెట్టి ఎప్పుడు ఏవి కావాలో అవి అమర్చి అన్నపానాదులతో కడుపునింపి పెంచి పెద్ద చేస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాగే మన మనుగడకు భూమి మూలాధారంగా అన్ని ఇస్తున్నది. అందుచేత భూమి మన మాతృభూమి. ఇది మనకు నిజంగా కన్నతల్లే. మాతృభూమి పట్లగల శ్రద్ధా భక్తులే జాతీయ జీవనానికి ఆధారం. అందుకే అధర్వణ వేదం భూమిసూక్తంలోమాతా భూమి: పుత్రోహం పృధివ్యా.’ అని చెప్పబడింది. అంటే భూమి నా తల్లి నేనామె పుత్రుడను. జాతీయ సంఘటనకు అదే మూల స్రోతస్సు. మాతాపుత్ర సంబంధం ఇచ్చి పుచ్చుకొనే సంబంధం కాదు. దానికి కారణాలు వెతికితే దొరకవు. ప్రపంచంలో తల్లిని మరిచిపోయే కొడుకు ఉండవచ్చు కాని కొడుకును మరిచిపోయే తల్లి ఎక్కడా ఉండదు అని చెప్పారు జగద్గురువు శంకరాచార్యు. మన దేశం, ఎల్లలు గురించి విష్ణు పురాణంలో
ఉత్తరం యత్ సముద్రస్య - హిమాద్రేశ్చైవ దక్షిణమ్

వర్షం తత్ భారతం నామ- భారతీ యత్ర సంతతిః
సముద్రాలకు ఉత్తరాన, హిమాలయముకు దక్షిణాన విస్తరించి ఉన్న దేశం భారతదేశం. దేశవాసులు భారతీయులు అని వర్ణించారు. ప్రేరణతో దేశం వికసిస్తూ వచ్చింది. దేశంలో జన్మించిన అనేక మంది మహాపురుషులు తమ జీవితాలను భారతమాతకు సమర్పణ చేశారు. భూమిని కాపాడుకోవడం మన కర్తవ్యం. స్వాతంత్య్ర పోరాటం సత్యం కోసము పోరాటంగా ప్రేరణ కలిగించింది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మన పెద్దలకు భారత్ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. ఇది ఒక మంత్రంగా భావించేవారు. అందుకు బంకించంద్రవందేమాతరంఅన్నారు. ‘ తల్లి నీకు నమస్కారముఅని దాని అర్థం. భారత్ అనటంతోటే భౌగోళికమైన ప్రజు, పర్వతాలు, నదులు, మొదలైనవి కాక ఒక భావాత్మక/ ప్రేరణభారత్మాతబంకించంద్ర ఇంకాత్వంహిదుర్గఅని వర్ణించారు. రవీంద్రుడుఅయిభువన మన మోహినిఅని వర్ణించారు. అరవిం దు భూమిని సాక్షాత్ జగన్మాతగా వర్ణించారు. భూమి సంరక్షణ కొరకు రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, గురుతేగ్ బహదూర్, గురుగోవింద్, aాన్సి క్ష్మిబాయి, నానాసాహెబ్ పీష్వా, మహారాజ్ ఛత్రసాల్, వంటి యోధు పోరాటం చేశారు. ఆంగ్లేయుపై జరిగిన పోరాటంలో అనేక మంది తమ జీవితాను త్యాగం చేశారు. సమయంలో భారత్ మాతాకీ జయ్’’ అనే నినాదం కోట్లాది ప్రజకు ప్రేరణ నిచ్చింది. వందేమాతర గీతం దేశమంతా ప్రతిధ్వనించింది. రోజున మనం ఎదుర్కొంటున్న అనేక సమస్య పరిష్కారా నికి అదే ప్రేరణ. అనేక భాషు, మతాు ఉన్నప్పటికీ భారత్మాతాకీ జయ్ అనే నినాదమే మన అందరినీ ఐక్యం చేస్తుంది. తల్లి, తండ్రి, గురువు మూడు రూపాు ఒకే ఆకృతి దాల్చి వచ్చిన దివ్యమూర్తి మన మాతృభూమి. మాతకు మన జీవితా ను సమర్పణ చేయానే భావన మన అందరి హృదయాలో జాగృతం కావాలి.
వంద సంవత్సరా పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాంగాన్ని అము పరుచుకున్నాం. స్వాతంత్య్రం సంపాదించుకుని 68 సంవత్సరాు పూర్తయ్యాయి. రోజున దేశంలో పరిస్థితు ఎట్లా ఉన్నాయి? ప్రేరణ దేశ స్వాతంత్య పోరాటానికి పురికొల్పిందో ప్రేరణ రోజున నాయకత్వంలో నేడు కనబడటం లేదు. దేశభక్తి అనేది ఒక మూఢనమ్మ కంగా భావిస్తున్నారు ఈరోజుల్లో.  ఇది ఇంకా ఎక్కువ కాం కొనసాగడం ప్రమాదకరము. దేశం సమస్యు పరిష్కరించుకునేందుకు మనమందరం ముందుకురావాలి. అటువంటి ఆలోచనతో దేశమంతటా జాగృతం కావాలి.దానికి ప్రేరణభారత్ మాతాకి జయ్అనే నినాదం. ఇంట్లో తల్లిదండ్రు ను, బళ్లో ఉపాధ్యాయును, ఊళ్లో పెద్దను దేశంలో నాయకును ప్రమాణం గా తీసుకొని ఈలోకం నడుస్తూ ఉంటుంది. కనుక ఒరవడి సరిగా ఉండాలి. సత్ప్రవర్తన, ధర్మపరాయణత్వం, శూరత్వం, కార్యనిర్వహణ సామర్థ్యం, కర్తవ్య నిష్ట, జ్ఞానం, యజ్ఞం ఇటువంటి శ్రేష్టగుణాలే దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడిపిస్తాయి. వ్యక్తిపూజ పెరిగితే కల్లాకపటాతో జనాన్ని మభ్యపెట్టి ప్రజను దురవాట్లకు బానిసను చేస్తారు. స్వార్థపరాయణులై సర్వం స్వాహాచేస్తుంటారు. దీన్ని నివారించేందుకు మనం పరంపరాగతంగా వస్తున్న మివను కాపాడు కోవడం మన అందరి కర్తవ్యం. అందుకే మన మాతృభూమిని ఆరాదిద్ధాం.
భారతమాతకు ముద్దబిడ్డం

హిందువుం ప్రియబంధువుం

దేశధర్మము ప్రగతి కోసమై

జీవించుటయే మన గమ్యం

సాధించుటయే మనక్ష్యం
అనే విషయము గుర్తుచేసుకుందాము. అందుకే జనవరి 26 సమున్నత క్ష్యం సాధించేందుకు భారతమాత పూజ కార్యక్రమం నిర్వహిద్దాం దానిలో పాల్గొందాము. దేశంలో మనమందరం సహోదరుం అనే భావన జాగృతం చేద్దాం. నేడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ‘భారత్బాతాకీ జయ్అనే నినాదం దేశంలో మారుమ్రోగిద్దాం.