అఖండ భారత్‌ అసాధ్యమేం కాదు..మధ్య రాంమాధవ్ ఆల్జజీరా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా పరస్పర అవగాహన ద్వారా అఖండ భారత్ సాధ్యమని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులందరూ భారత్ విభజన సమసి పోవాలని కోరుకునేవారు. యోగి అరవిం 1947 ఆగస్టు 15 భారత ప్రభుత్వానికి పంపిన లిఖిత పూర్వక సందేశంలోఈరోజున జరిగిన దేశ విభజ శాశ్వతమని ఎవ్వరూ మనస్సుల్లో నిర్ణయించు కోరాదు. ఈవిభజన సమసిపోవాలి. అప్పుడే భారత్ శక్తివంతమవుతుందిఅని చెప్పారు. వేలసంవత్సరాల నుంచి భారత్ సాంస్కృతికంగా, సామాజికం గా, ఆర్థికంగా ఒక దేశంగా ఉండేది. దేశ విభజన తర్వాత కొన్నిసంవత్సరాలకు భారత్ నుంచి విడిపోయిన భూభాగాలు అన్ని కలిసి సార్క్గా ఏర్పడ్డాయి. సార్క్ దేశాల మధ్య ఆర్థిక విషయాలో, సాంస్కృతి విషయాలలో పరస్పర అవగాహనకు చర్చలు జరుగుతుంటాయి. ఇదే అఖండ భారత్కు దారి చూపించేది.  రెండవ ప్రపంచ యుద్ధం తరువాత విడిపోయిన దేశాలు ఒక్కొక్కటీ కలిసిపోతున్నాయి. మార్గంలోనే భారత్ నుంచి విడిపోయిన భూభాగాలు కూడా కలిసిపోయి శక్తివంతమైన భారత్ నిర్మాణం కావాలి. ఇది సహజమైన ఆకాంక్ష. ఆకాంక్షను చెప్పటం కొందరికి కంట గింపుగా ఉంటుంది. కాని మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఇది అవసరం. దానితోనే భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారుతుంది.