భారత్‌ అత్యంత సహన శీల దేశంప్రపంచంలోనే భారత్ అత్యంత సహనశీల దేశం. గతంలో భారత్ ఎన్నో దాడులను ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ అసహనాన్ని ప్రదర్శించలేదు. ఎవ్వరు ఎవ్వరి మీద, ఏమైనా మాట్లాడవచ్చు. అది చక్కగా ప్రచురితమవుతుంది. మీడియాలోనూ ప్రసారమవుతుంది. అదొక్కటే చాలు మనది ఎంత సహనశీల దేశమో చెప్పడానికి. ఎక్కడో చోట ఏవో ఒకటి, రెండు సంఘటను చోటు చేసుకున్నంత మాత్రాన వాటిని బూచీగా చూపి భారత్లో అసహనం తీవ్రమైందని చెప్పడం మాత్రం సరికాదు. మనం ఎంతో ఉన్నత సంస్కారం కలిగినవాళ్ళం. మన దేశాన్ని అత్యంత శక్తివంతమైనదిగా తీర్చిదిద్దడమే మన  లక్ష్యం కావాలి.   
-పద్మభూషన్ ఎల్.సుబ్రమణ్యం, ప్రముఖ వయోలిన్ విద్వాంసు