ఐఎస్ఐఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న దక్షిణ భారత యువకులు 
మధ్య ఎన్ఐఏ చీఫ్ శరత్‌కుమార్ లక్నోలో మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న వాళ్లలో దక్షిణ భారత్‌కు సంబంధించిన ముస్లిం యువకులే ఎక్కువ మంది ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న యువకులను ఉగ్రవాదం నుంచి మరలించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష ప్రయత్నం చేస్తున్నది. ఇంటలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం 20మంది భారత యువకులు సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ సంస్థల్లో చేరినట్లుగా సమాచారం. ఇందులో ఒక్కరూ తప్పించుకొని తిరిగి భారత్‌కు వచ్చారు. ఆరుగురు దాడుల్లో చనిపోయారు. మరో ముప్పై మంది భారత్‌ను వదిలి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం కూడా అందింది.  బొంబాయికి సంబంధించిన 25 సంవత్సరాల వాషీద్ అతని భార్య ఇచ్చిన సమాచారం ప్రకారం బొంబయి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. దక్షిణ భారత్‌లో ఎక్కువగా తెలంగాణ అందులో హైదరాబాద్ నుంచే ఐఎస్ సిద్ధాంతాల పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్లు సమాచారం.