నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతదేశ ప్రజల ప్రస్తుత మనోగతం గురించి ఎబీపీ` నిల్సన్ చేసిన సర్వే ఫలితాలు నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా 58 శాతం ప్రజలు పరిగణిస్తున్నారు. ఇది పరిపూర్ణమైన ఆధిక్యమే. ప్రజాదరణ విషయంలో తరువాతి స్థానంలో రాహుల్గాంధీయే  ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాహుల్ గాంధీకి 11శాతం ప్రజల మద్దతు మాత్రమే  ఉంది. సర్వేలో అంతే ప్రాధాన్యం కలిగిన మరొక అంశం.. బీజేపీ ఓట్లు తగ్గడానికి బదులు గణనీయంగా పెరిగాయి. కాంగ్రెస్కు ఉన్న ప్రజా మద్దతు నాటకీయంగా పడిపోయింది కూడా. 2014 సార్వత్రిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కేవం 19.52శాతం ప్రజల మద్దతుకే పరిమితమైంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సర్వే ప్రకారం పార్టీకి 14శాతం మద్దతు మాత్రమే దక్కుతుంది.