నిష్కామ భక్తికి ప్రతీక సంత్‌ రవిదాస్‌

సంత్ రవిదాస్ భక్తియుగంలో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడు. క్రీ.. 16 శతాబ్దానికి చెందినవాడు. వీరు చెప్పులు కుట్టి జీవించే చమార్ (మాదిగ) కులమునందు జన్మించారు. వీరు కాశీపట్టణ వాస్తవ్యులు. వీరు ప్రముఖ విష్ణుభక్తుడైన రామానందుని అనుయాయులో ఒకరు.