పాదరక్షలు కాదు` పాదమే రక్షణహిందువుల అనాగరికులు, కాళ్ళకు జోళ్ళు వేసుకోవాలనే జ్ఞానం కూడా లేని అజ్ఞానులుఅన్నాడు తెల్లవాడు. ఔనుమరి ఒకప్పుడు మనవారు ఎక్కువ మంది చెప్పు లేకుండానే తిరిగేవారు` ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నవారు, పవిత్రమైన కొండలు ఎక్కేవారు పాదరక్షలు లేకుండానే తిరుగుతూ ఉంటారు. ఐతే ఇటీవల జరిగిన పరిశోధనలు తేల్చిన విషయాలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.  మట్టినేలపై ఇసుక నేలపై మరియు గడ్డి నేలపై ఒట్టి పాదాలతో దినానికి ఒక అర్థగంట పాటైనా నడవటం చాలా మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే నిద్రలేమి, వివిధ నొప్పులు మరియూ బహిష్ఠుకి ముందు వచ్చే కడుపుబ్బరం, తలనొప్పి నీరసం వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒట్టి పాదాలతో నడవటం ఔషధం లాగా పనిచేస్తుంది.