జాతి వ్యతిరేక శక్తుల స్థావరాలుగా మారుతున్న విశ్వవిద్యాయాలుమధ్యయగంలో మొఘలు తీవ్రవాదులు భారతదేశంపై దండెత్తి ప్రపంచ జ్ఞానసంపదకు కేంద్రబిందువులైన నంద, తక్షశి వంటి అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. యుగాలు మారాయి, చట్టాలు వచ్చాయి. వీటితోపా టు తీవ్రవాదం పంథా కూడా మారింది. ఇప్పుడు జాతి విద్రోహక శక్తులు ఏకంగా విశ్వవిద్యాలయాల్లోనే మకాం వేశాయి. తమ విషపూరిత సిద్ధాంతాలతో విద్యార్ధులను సంఘవిద్రోహులుగా మార్చడమే వీటి లక్ష్యం.
ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ అనే పరిశోధానా విద్యార్ధి ఆత్మహత్య ఘటన తరహా చర్చను మరోసారి తెరమీదకి తెచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన రోహిత్ చిన్నతనం నుండి చదువులో అత్యంత శ్రద్ధ కనబరిచేవాడు. స్వామి వివేకానందుని స్పూర్తిగా తీసుకున్నాడు. కుటుంబలో తల్లిదండ్రుల మధ్య విభేదాలు, పేదరికం వంటి సమస్యలను అధిగమించి ఉన్నత లక్ష్యాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. సంక్రాంతి, దసరా వంటి హిందూ పండుగలపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసే రోహిత్  హిందూ ధర్మాన్ని ఎంతగానో గౌరవించే విశ్వ విఖ్యాత సైన్సు రచయిత కార్ల్ సాగన్ అంతటివాడు కావాలని ఆశించాడు. ఒకానొక దశలో నరేంద్ర మోదీ వంటి జాతీయతా భావాలు కలిగిన నేతపై మీడియా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసించాడు.
తరువాత నుండి అతడి జీవితం అనుకోని ముపు తిరిగింది. యూనివర్సిటీలో తిష్టవేసుకుని ఉన్న సంఘవిద్రోహక శక్తులు విధ్యార్ధి ఉజ్వల భవిష్యత్తుని కాలరాసాయి. ఆమ్ఆద్మీ పార్టీ అవలంభించే ఆవేశపూరిత విధానాలకు ఆకర్షితుడయాడు. తరువాత కమ్యూనిస్టు అనుబంధ విధ్యార్ధి సంఘం ఎస్.ఎఫ్.ఐకు దగ్గరయ్యాడు. ఆతరువాత అసదుద్దీన్ ఒవైసీ వంటి ఇస్లామిక్ అతివాదులు మద్దతిస్తున్న అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరాడు. ఆప్ నుండి ప్రతికూల దృక్కోణం, ఎస్.ఎఫ్. నుండి విప్లవవాదం, అరాచకత్వం వంటి లక్షణాలు పొందిన రోహిత్ మనసులో  ఏఎస్ తీవ్రమైన హిందూ వ్యతిరేకతను నింపింది. ఫలితం.. అప్పటి వరకు తాను స్పూర్తిగా తీసుకున్న వివేకానందుడే ఇప్పుడు కులవాదిగా కనిపించాడు. కారణంగానే హిందుత్వం మీద తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. కాషాయం రంగులో ఉంటే తమ ఇంటి స్త్రీ బట్టలు కూడా చించిపారేస్తా అనేటంత వరకు వచ్చింది పరిస్థితి. తాను అభిమానించే సంక్రాంతి, దసరా వంటి పండుగలకు బదులు బీఫ్ ఫెస్టివల్ వంటి హీనమైన సంసృతికి మద్దతు తెలిపాడు. ఇతనిపై ఏఎస్ ప్రభావం ఎంతగా  పనిచేసిందంటే ముంబై పేలుళ్లకు పాల్పడి 250 అమాయకుల మరణానికి కారణమైన యాకూబ్ మెమన్ అనే తీవ్రవాదికి సుప్రీమ్ కోర్టు విధించిన మరణశిక్షను తీవ్రంగా నిరసించాడు. తీవ్రవాదికి మద్దతుగా విశ్వవిద్యాలయంలో నమాజు నిర్వహించి, ‘‘ఒక్క యాకూబ్ మెమన్ను చంపితే ఇంటికొక యాకూబ్ మెమన్ పుడతాడుఅంటూ తీవ్రమైన దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చాడు. దాన్ని విమర్శించినందుకు సుశీల్ అనే విద్యార్ధిని అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా గాయపరిచారు. స్వల్పకాలంలోనే ఇంతటి విపరీత ప్రవర్తనకు కారణాలు ఏమిటి?
హెచ్సియూ, జెఎన్యూ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నేడు జాతివ్యతిరేక శక్తులకు నిలయంగా మారాయి. జాతివ్యతిరేకత, కులద్వేషం, కుట్రపూరిత విధానాలు వంటి భావజాలం కలిగిన అనేక కమ్యూనిస్టు, ఇస్లామిక్ అనుబంధ విద్యార్ధి సంఘాలు తమ కుటిల రాజకీయ అవసరాల కోసం విద్యార్ధులను పావుగా వాడుకుంటున్నాయి. విద్యార్ధుల్లో ఆవేశం రగిలిస్తాయి. కుల రహిత సమాజం కోసం పోరాటం అని చెప్తూ వారికి తెలియకుండానే వారిలో కుల విద్వేషాన్ని నింపుతాయి. ఇతరును కుం అడ్డంపెట్టుకుని ఎలా భయపెట్ట వచ్చొ నేర్పుతాయి. సెక్యురిజం అని బోధిస్తూ హిందూ వ్యతిరేకత నూరిపొస్తాయి. మనువాదంపైన పోరు అంటాయి. మనుస్మృతి అనేది కలియుగంలో పాటించేది కాదు అని చెప్పినా వినవు. ఇక వీరు సాగించే ప్రతి దుశ్చర్య అంబేద్కర్ ఆశయం అని చెప్పుకుంటూ తమ రాజకీయ లాభాు ఎలా నెరవేర్చుకోవచ్చో వీరికి బాగా తొసు. ఇటువంటి సంస్థపై ఇప్పటికైనా ప్రభుత్వం కఠినంగా వ్యహరించి విద్యాసంస్థను ప్రక్షాళన చేయాలి..