గ్రామ విద్యా మందిరాల ద్వారా సామాజిక మార్పుకొరకు శంఖనాదమిస్తున్న విశ్వహిందూపరిషత్‌1988 సంవత్సరంలో సుదూర గ్రామ మరియు వనవాసి బంధువును సామాజికంగా, సాంస్కృతికంగా మరియు ఆర్థిక దృష్టితో సర్వాంగణ వికాసం పెంపొందింపజేసి, వారిని జాతీయ స్రవంతిలో బలమైన శక్తిగా జోడించాలనే సత్సంకల్పంతోఏకల్-విద్యాయాలుప్రకల్పాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఝార్ఖండ్, ఓడిస్సా, బెంగాల్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రా వనవాసి ప్రాంతాలతో ఆరంభమైన ఉద్యమం నేడు దేశమొత్తంలోని 21 రాష్ట్రాలో 49,299 మరియు నేపాల్లో 1,912 గ్రామాలో క్రియాశీల కార్యం ప్రభావితంగా ఉన్నది.
బాలరకు ప్రాథమిక విద్యాతో ఉద్యమం ఆరంభమైంది. ఇందులో భాష మరియు గణితంతో పాటు సంస్కారం పట్ల కూడా దృష్టి సారించడం జరుగుతుంది. మూడు గంటల శిక్షణ కాలాంశంలో ఒకే ఒక ఆచార్య ద్వారా ఉచిత విద్యనందించి వారిని ఉన్నత విద్యనభ్యసించడానికి సంసిద్ధులుగా చేస్తూనే ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో, బాధ్యతగల నాగరికులుగా మన ముందు ఉంటున్నారు. ప్రస్తుత తరుణంలో విద్యాయాలలో చదివే వారి సంఖ్య 15లక్ష కంటే అధికంగా ఉన్నారు. ప్రాథమిక విద్యతోపాటు వీరికి ఆరోగ్యం, జైవిక వ్యవసాయం, గౌ ఆధారిత పంట, మరియు సుసంస్కార సంబంధిత అనేక కార్యక్రమాల నిర్వాహణ జరుగుతుంది. సమర్థవైద్యులు మరియు వైద్యరంగా నిష్ణాతులచే మారుమూల గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, ఝార్ఖండ్ ఇంకను రాజస్థాన్లోని మారుమూల గ్రామల ప్రజలకు వనమూలిక ద్వారా గృహవైద్య విధానం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. 800 గ్రామాలలోని మహిళలకు మరియు బాలల్లో రక్తహీనతను గుర్తించి దాని నివారణకు మార్గం సుగమం చేసి సమస్యపై విజయం సాధించడం జరిగింది. విధంగా వీటి ప్రభావం చేత దేశంలో ఇటువంటి విద్యా యాల ద్వారా విద్య-వైద్య, సుసంస్కార జీవనంతో పాటుగా గో ఆధారిత వ్యవసాయ` ఉపాధి అవకాశాలను పెంపొందించడం జరుగుతుంది.