విద్వేషాలు రెచ్చగొట్టేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి2016 జనవరి 17 భాగ్యనగర్ సెంట్రల్ యూనివర్సి టీ పిహెచ్డి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఒక విషాదకర సంఘటన. దేశవ్యాప్తంగా అనేకమందిని కదిలిం చింది. అనేకమంది జాతీయ, ప్రాంతీయ నాయకులు హైద్రాబాద్కు వచ్చి రోహిత్తల్లికి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. పత్రికలో వాద ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణం ఎవరు? రోహిత్ ఏ కులంవాడు అనే విషయాలపై వాదప్రతివాదనలను కొనసాగుతూనే ఉన్నాయి. ఈవాద ప్రతివాదనలు మరుగున అసలు విషయాలు వెలుగు చూడకుండా ఉంచేందుకు కొందరు పనిగ ట్టుకొని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు, హిందుత్వ వాదులే కారణమని చూపేందు కు పడరాని పాట్లు పడుతున్నారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య జూడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ అధ్యక్షుడిగా రిటైర్డ్ జడ్జి అశోక్ కుమార్ రూపన్వాల్ను నియమించింది. ఒక ప్రక్క ప్రభుత్వం న్యాయ విచారణ ప్రక్రియ ప్రారంభిస్తే మరో ప్రక్క రాజకీయ నాయకులు సంఘటనను రాజకీయం చేసేందుకు నానా హంగామా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి దళితుల సానుభూతి పొందాలని నానా తంటాలు పడుతున్నారు. రాహుల్ గాంధి ఇప్పటికి రెండుసార్లు వచ్చాడు.
సందర్భాన్ని ఉపయోగించుకొని ఒక ప్రక్క హిందుత్వంపైన, మరో ప్రక్క కేంద్ర ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తున్నారు. దేశం లో ఎక్కడ సంఘటన జరిగినా లోపం జరిగిన అన్నింటికి హిందుత్వవాదులు, మోడీదే పాపము అని సిద్ధాంతీకరించే నాయకులు మన ముందు ఉన్నారు. ఉదా: కేజ్రీవాల్, మమత, అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ మొదలైనవారు.
ఇదంతా రాజకీయం. అసలు వాస్తవ విషయాలు ఆలోచిస్తే భాగ్యనగరంలో ఉన్న సెంట్రల్ యూనివర్శిటీ ఢల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి నకులుగా  ఉంటోంది. ఎక్కువ మంది ప్రొఫెసర్లు ఢల్లీ యూనివర్సిటి నుండి మార్గదర్శనం పొందుతున్నవారు. ఢల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎక్కువగా మార్క్స్, మావోవాదుల ప్రాబల్యంలో ఉన్నది. విద్యార్థుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి వారిని గ్రూపులుగా చీల్చి సంఘర్షణను నిర్మాణం చేయటానికి దశాబ్దాలుగా అక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటి శక్తులను గుర్తించి వారిని అదుపు చేయనంతవరకు విద్యార్థుల మధ్య ఘర్షణకు అంతం ఉండదు. దేశంలో కాని, మన రాష్ట్రంలో కాని మార్క్స్ మావోవాదులు హింసా కాండకు ఎంతమంది బలైనారో చిట్టావిప్పితే అర్థమవుతుంది. మార్క్స్ మవోవాదుల భావాజాలంలో చిక్కుకొని ఎంత మంది విద్యార్థులు నక్సలిజం వైపు మళ్ళీ తమ జీవితాలను నాశనం చేసుకున్నారో ఒకసారి గమనించాలి. సమాజంలో సంఘర్షణ నిప్పు కొలిమిని రాజేయటమే వారి నైజం. మార్క్స్ మావోవాదులు ఈరోజున తమ ఉనికిని కాపాడుకోవటానికి క్రొత్త అవతారం ఎత్తుతున్నారు. దానిని అందరూ గమనించాలి.దేశంలో ఎక్కడైన విపత్కర సంఘటనలు చోటు చేసుకొంటే అక్కడ పరిస్థితులు చక్కదిద్దేందుకు అటువంటి పరిస్థితులు తిరిగి తలెత్తకుండా చూసేందుకు అందరిని కలుపుకొని పోవాలి. సమయంలో జాతి యావత్ అప్రమత్తం కావాలి. సమాజంలో విధ్వేషాలు పెరగకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది.