హంసవాహినీ... జ్ఞానదాయినీ: వసంతపంచమి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

సరస్వతీం శుక్లవరాం సుస్మితాం సుమనోహరామ్
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్

వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్
జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీత్వాదుల్ని చదువుల తల్లి అనుగ్రహిస్తుంది. సత్వ, రజ, తమో గుణాలను బట్టి ముగ్గురు అమ్మలను మూడు రూపాలుగా మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా కీర్తిస్తారు. మువ్వురమ్మలో  సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి. అహింసరూపానికి ఆనవాలు. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం సరస్వతీ దేవి అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. పురాణాలన్నింటినీ చూస్తే ఆమె యుద్ధం చేసిన ఆనవాలు అసలే లేదు.
శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి... కఛపి అనే వీణని, దండ, కమండం, అక్షరమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాను ఈదేవి సంహరిస్తుంది. ధవళ మూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత ముఖంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన రుషులకు మాత్రమే కాదు జగత్తుకంతటికీ వాక్ వైభవాన్ని వరంగా ఇచ్చింది. మనకున్న జ్ఞానం తల్లి వరమే. జ్ఞాన మంటే కేవలం చదువు మాత్రమే కాదు, మంచి చెడులను గురించిన విచక్షణ కలిగి ఉండడము కూడా జ్ఞానమే. త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తిరూపం.సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్వాగ్రంపైఈమె నివాసంఉంటుంది. 
చిలుక వాక్కుకు సంకేతం అందుకే వాగ్దేవతను ఆశ్రయించి ఉంటుంది. సరస్వతి బాలచంద్రుని కుసుమంగా ధరించింది. పాటలకు తోడుగా బంగారు వీణ మ్రోగుతుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలు ఆమెకు కేళీ గృహాలు. నాలుగు ముఖాలు నాలుగు వేదాలు. వేదాల వాక్కుకు మూలాలు. బ్రహ్మాముఖంలో సరస్వతి ఉన్నదని శాస్త్రోక్తి. హంసవాహనంగ నాద స్వరూపిణి దేవి చదుర్ధశభువనాధీశ్వరి. పాండిత్యమూ...సంగీతం రెండూ సరస్వతి అధీనంలోనివే. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వ తీ జయంతిగా జరుపుకొంటారు. మాఘమా సం శుక్షపక్షంలో ఐదవరోజును పర్వదినంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వాగ్దేవి ఉద్భవించిన రోజు. రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు.
షోడశ సంస్కారాలలో ముఖ్యమైన సంస్కారం అక్షరాభ్యాసం. వసంత పంచమినాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుతారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత రుతువు క్షణాలు ప్రకృతిలో కనబడుతుంటాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతికను అందిస్తుంది. వసంత రుతువు శోభకువసంత పంచమివేడుక శ్రీకారం చుడుతుంది. అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని దినం తొలిసారిగా దిద్దటంతో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల  ప్రాయంలో అక్షరాభ్యాసం చేస్తారు.అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది ‘‘అభ్యాసం- అంటే సాధన. ఇంకో విశేషం ఏమిటంటేఅక్షర లో ‘‘మొదలుకునిక్షతో ముగిసేవి కనుక ‘‘అక్షము అని చెప్పుకోవచ్చును. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ‘‘ఓం నమః శివాయ సిద్ధం నమఃఅని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలకపై వ్రాయిస్తారు.
సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, అలాంటి ఉత్పాదకుడికే శక్తిని అందించే సరస్వతీ పూజను రోజున నిర్వహించుకోవడం కూడా సహేతుకం. ఉత్తర భారతంలో పూజను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. శ్రీ పంచమిలో శ్రీ అంటే సంపద. జ్ఞాన ప్రదాత అయిన సరస్వతిని ఈరోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. దక్షిణాదిలో కూడా చాలామంది ఈరోజున సరస్వతీ దేవిని అర్చిస్తారు. సాధారణంగా దేవాలయలలో మూడు రోజులపాటు వసంత పంచమిని జరుపుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవిగా ప్రత్యేక అలంకారం చేస్తారు. అలాగే బాసరలో కొలువై వున్న సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్వంయాకుందేందు...’ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ. వాక్కుకీ, జ్ఞానానికీ చదువుకి ఆమె అధిదేవత. వేదాల్లో కూడా సరస్వతీ సూక్తాలున్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. ఈరోజున అమ్మవారిని తెల్లపూలతో అర్చించి పాయ సం నైవేద్యంగా పెట్టాలి. సరస్వతీ దేవిని పూజించడం అంటే కేవలం చిన్న పిల్లలకు మాత్రమే అనే అపోహ కూడా చాలా మందిలో ఉంది.కానీ జ్ఞానం ప్రతీ ఒక్కరి కీ అవసరమే.అందుకే అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానదాయిని పుట్టినరోజు నాడు అర్చించే అవకా శం మనకు వసంత పంచమి (శ్రీపంచమి) రూపంలో వచ్చింది. దానిని సద్విని యోగం చేసుకుందాం.