సందిగ్ధంలో భారత్‌పాక్‌ సంబంధాలు


పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లోని పఠాన్కోట సైనిక విమాన స్థావరంపై  దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలు మళ్లీ మొదటికొచ్చాయి. సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా పాకిస్థాన్కు ఒక హెచ్చరిక చేశారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ భూభాగంలో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి వాటిని సంపూర్ణంగా రూపుమాపాలని హెచ్చరించాడు. దీనికి సమర్థనగా అమెరిక కాంగ్రెస్ పాకిస్థాన్కు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.
భారత్తో శాంతి చర్చలు జరపాలని పాకిస్థాన్లోని వ్యాపారవర్గాలు, రాజకీయ నాయకులు గట్టిగా కోరుతున్నారు. అయినప్పటికీ అంశం సైన్యంపై ప్రభావం చూపలేకపోతున్నది. సైన్యంతో ప్రభావితమైన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు కూడా సైన్యానికి వంతపాడతాయి. ఇప్పుడు తీవ్రవాద సంస్థదే పై చెయ్యిగా నడుస్తున్నది. సైన్యం తీవ్రవాద, మతవాద శక్తుల సానుకూలత లేకుండా సమస్యను పరిష్కరించే స్థితిలో లేదని అర్థమవుతున్నది.  కాబట్టి భారత్తో సానుకూల చర్చకు చాల సమయమే పట్టవచ్చునని అనిపిస్తున్నది. దానితో భారత్కు ఉగ్రవాదుల బెడద ఉంటుంది. అదే నిజమయితే పాకిస్థానీయులకు ఎంతో ప్రియమైన భారతీయ పాన్ను వయా దుబాయ్ నుండి కొనుక్కోవలసి వస్తుంది. దానిరేటు భారత్లో రేటుకు 10రెట్ల ఎక్కువ పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. భారత్తో స్వేచ్ఛావాణిజ్యానికి మార్గం సుగమం కానంతవరకు ఇదే పరిస్థితి ఉంటుంది. భారత్ కూడా ఉగ్రదాడులకు కాచుకోవటానికి సదా అప్రమత్తంగా ఉండవలసి వస్తుంది.