సేవా భారతి` రామాయంపేట ఖండ-సేవా సమ్మేళనం 
సేవాభారతి రామాయంపేట ఖండ, సేవా సమ్మేళనము స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో జరిగింది. ఇందులో రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాలోని 22 గ్రామాలలోని వివిధ బాలసంస్కార కేంద్రాలు, కిషోరీవికాస కేంద్రాలు, భజనమండలు, సేవ ప్రకల్పా నుండి 300 మంది విద్యార్థులు, పాల్గొనివారు ప్రతివారం వారి గ్రామంలోని కేంద్రాలో అభ్యసించునటువంటి సంస్కారాలను, వివిధ సాంస్కృతిక కార్యక్రమా రూపంలో, నాటికలు, ఏకపాత్రాభినయాలు, గేయాలు, శ్లోకాలు మరియు దేశభక్తుల చరిత్రకు సంబంధిం చిన విషయాలను ఇక్కడకు విచ్చేసిన ఆహుతుల ముందు చక్కగా, స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించి వారి మన్నలను పొందారు. మరియు క్విజ్, దేశభక్తి పాటలు మరియు ఆట పోటీలో పాల్గొని విజేతలైన వారు బహుమతులు పొందారు
కార్యక్రమంలో విద్యార్థులకు మార్గదర్శనము చేయటకు మాన్యశ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యంగారు తెంగాణ ప్రాంత సహకార్యవాహ. (ఆర్ఎస్ఎస్) విచ్చేసి ప్రతిగ్రామంలో ఇలాంటి సేవా ప్రకల్పాలు నిర్వహించి తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను  పఠించాలని చెప్పారు. ప్రతి విద్యార్థి దేశభక్తునిగా మారిన రోజునే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కార్యక్రమాలను నిర్వహిస్తున్న వివేకానంద సేవాసమితి వారిని అభినందించారు. కార్యక్ర మంలో వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు శ్రీపెద్దిరెడ్డి కృష్ణారెడ్డి గారు, సేవా భారతి ప్రముఖులు వాసూ, చంద్రశేఖర్రెడ్డి, సేవాసమితి సభ్యులు పడకంటి సంగమేశ్వర్ గారు, డా శ్రీనివాసురావు, సాగని యాదగిరి, శీం మల్లారెడ్డి, కుమార్, శ్రీకాంత్, ఎడ్లబాల్రెడ్డి, ఏలూరి పండరినాద్ వివిధ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.