పునరావృతమవుతున్న ముస్లింల దాడులుసమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కాని మా అభిప్రాయాలే సరైనవి అని చెప్పుతున్న వారితోనే అసలైన సవాల్. మన దేశంలో ముస్లిం మతస్థుల వ్యవహార శైలి ఇట్లాగే ఉంటోంది.  మధ్య ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీ నేత, క్యాబినెట్ మంత్రి ఆజంఖాన్ ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి దిగజారుడుగా మాట్లాడాడు. దానిపై ఉత్తరప్రదేశ్లోని హిందూ మహాసభ అధినేత కమలేశ్ తివారి అదే స్థాయిలో మోహమ్మద్పై విమర్శ చేశాడు. విమర్శ కారణంగా ముజఫర్నగర్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తివారిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇదంతా డిసెంబర్ మొదటి, రెండో వారంలో జరిగిన సంఘటన. కానీ సంఘటనపై పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాలో జనవరి3 తేది నాడు అంజుమన్ అహలే సున్నతుల్ జమాత్ అనే సంస్థ ఆధ్వర్యంలో సుమారు లక్ష మందికి పైగా ముస్లింలు కాలియా చౌక్ అనే ప్రాంతంలో భారీ బహిరంగ ప్రదర్శన చేశారు. సందర్భంగా కమలేశ్ తివారీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ భారీ విధ్వంసం సృష్టించారు. విధ్వంసంలో ముఖ్యం గా కాలియా చౌక్ పోలిస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇంకొక ప్రక్క అక్కడే మార్కెట్లో ఉన్న హిందువుల దుకాణాలు, ఇళ్లపై కూడా దాడులు చేశారు. వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు కూడా తగలబెట్టడం జరిగింది. అక్కడే ఉన్న 34 జాతీయ రహదారిపై వెళ్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లపై, పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసులపై విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడున్న ఆయుధాలను కూడా దోచుకెళ్లారు. మహిళపై కూడా దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు. పరిస్థితులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయంగా ఉంది. ఎందుకంటే సహాయం కోసం అర్థించిన పోలీసులకు సహాయం అందించకపోగా ముస్లిం మూకలపై లాఠీ చార్జీగాని కాలుపులుగాని జరపరాదని ఆదేశించినట్లు పోలీసులు స్వయంగా చెప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంఘటనపై మాట్లాడుతూ మాల్దాలో జరిగిన సంఘటనను అదొక స్థానిక సమస్యగా పేర్కొంది. దాంతో ప్రదేశానికి మీడియాకాని, బిజెపి నాయకులు కానీ వెళ్లకుండా రైల్వేస్టేషన్లోనే వారిని అరెస్టు చేసి వెనక్కు పంపటం జరిగింది. వార్తను పత్రికలలో రాకుండా జాగ్రత్త పడింది. కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల కారణంగా ప్రధాన మీడియా వార్తలు రాయవల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి పరిస్థితులకు కారణమేంటి అని పరిశీలించినట్లైతే రెండు మూడు విషయాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. 1) జిల్లాలో ముస్లిం జనాభా 70శాతం చేరుకుంది. 2) జిల్లాలోని చుట్టు ప్రక్క గ్రామాల్లో గంజాయి, ఓపీయం లాంటి మాదక ద్రవ్యాలు పండించటం, నకిలీ నోట్లు బహిరంగంగా విక్రయించటం జరుగుతున్నది. దానితోపాటు బాంబులు కూడా తయారు చేస్తున్నారనే విషయం కేంద్రం ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా కేంద్రానికి సమాచారం వెళ్ళింది.దీనికి నిరసనగా బలప్రదర్శన జరిగినట్టుగా అర్థమవుతున్నది. బెంగాల్లో జరిగిన నాలుగు రోజుల తరువాత బీహార్లో ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ పురిణియా జిల్లాలో కూడా వేలమంది ముస్లింతో బహిరంగ ప్రదర్శన చేశారు. అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు. వార్త కూడా స్థానిక, జాతీయ మీడియాలో తొక్కిపెట్టడం జరిగింది. జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లింలు అక్రమ వలసలు విపరీతంగా ఉన్నాయి. దానితో సమస్యలు బాగా పెరుగుతున్నాయి. మధ్య జనవరి 30 తేదినాడు ఆంధ్రప్రదేశ్లోని నెల్ల్రురులో రెండు గంటలపాటు ముస్లిం యువత స్థానిక పోలిస్ స్టేషన్లపై దాడిచేసి తమ బలాన్ని ప్రదర్శించింది. ఎస్పీ వాహనంపై కూడా దాడి చేసింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసింది. దీనికి కారణం స్థానికి ఎస్పీ ముస్లిం యువత టెర్రరిస్టు కార్యకలాపాలవైపు ఆకర్షితులు కాకుండా ఉంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై పోలీసులతో సమాచారం పంచుకోవాలని ముస్లింను కోరినట్టు, దానికి ప్రతిగా సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది.ఇటువంటి సంఘటనలు దేశంలో చోటు చేసుకోవటానికి దేశ రాజకీయాలే ప్రధాన కారణము అని అన్పిస్తున్నది. ప్రతి చిన్న విషయానికి గుంపులు గుంపులుగా రోడ్డేక్కి విధ్వంసం సృష్టించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇటువంటి విషయాలలో ప్రజలు అప్రమత్తమై తమను తాము రక్షించుకొనేందుకు ప్రయత్నించవలసిన అవసరం మరింత పెరుగుతోంది.