హంసవాహినీ... జ్ఞానదాయినీ: వసంతపంచమి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీత్వాదుల్ని చదువుల తల్లి అనుగ్రహిస్తుంది. సత్వ, రజ, తమో గుణాలను బట్టి ముగ్గురు అమ్మలను మూడు రూపాలుగా మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా కీర్తిస్తారు. మువ్వురమ్మలో  సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి. అహింసరూపానికి ఆనవాలు. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం సరస్వతీ దేవి అహింసకు అధినాయికగా పేర్కొంటోంది.