సేవా భారతి` రామాయంపేట ఖండ-సేవా సమ్మేళనం

సేవాభారతి రామాయంపేట ఖండ, సేవా సమ్మేళనము స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో జరిగింది. ఇందులో రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాలోని 22 గ్రామాలలోని వివిధ బాలసంస్కార కేంద్రాలు, కిషోరీవికాస కేంద్రాలు, భజనమండలు, సేవ ప్రకల్పా నుండి 300 మంది విద్యార్థులు, పాల్గొనివారు ప్రతివారం వారి గ్రామంలోని కేంద్రాలో అభ్యసించునటువంటి సంస్కారాలను, వివిధ సాంస్కృతిక కార్యక్రమా రూపంలో, నాటికలు, ఏకపాత్రాభినయాలు, గేయాలు, శ్లోకాలు మరియు దేశభక్తుల చరిత్రకు సంబంధిం చిన విషయాలను ఇక్కడకు విచ్చేసిన ఆహుతుల ముందు చక్కగా, స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించి వారి మన్నలను పొందారు.