ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా... ...నలుపు నలుపే కాని తెలుపు కాదు! అన్నాడొక శతకకర్త. కనకపు సింహాసనమున శునకంబు కూర్చో బెట్టినా` వెనుకటి గుణం మానదు అన్నాడు ఇంకొక శతక కర్త. మనదేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నతమైనది. న్యాయమూర్తికి ఎంతో గౌరవం ఇస్తాం మనం. అటువంటి న్యాయమూర్తి ఎంత ఉన్నతంగా ఉండాలో మీరే ఆలోచించండి లేదా ఒక రిటైర్డ్ జడ్జి మాటలు ఆలకించండి...ఏం. అహ్మదీ భారత సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ చేశాడు. కర్ణావతి శివార్లలో జరిగిన ఒక కాంగ్రెస్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఇలా అన్నాడుఆర్ఎస్ఎస్కు భయపడి ఓటు వేయొద్దునిక్కర్లు ధరించి చేతిలో లాఠీలు పట్టుకుని రోడ్లపైకి వచ్చేవారిని చూచి భయపడకండి. ప్రజలలో భయాన్ని రేకెత్తించడానికి వారు బయటకు వస్తారుఅని వ్యాఖ్యానించాడు.వాస్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనాలను భయపెట్టరు, జనాలను దగ్గరకు తీస్తారు. న్యాయం కోసం పోరాడుతారు. అటువంటివారిపై ఆరోపణలు చేసే ఇటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో న్యాయమూర్తిగా ఉండి ఉంటారు. వీడు ఎటువంటి తీర్పు ఇచ్చి ఉంటాడు? ఏమి దౌర్భాగ్యం.