సంస్కార సాధన పథంలో శ్రీహరి సత్సంగ్ సమితి వైశిష్ట్యంబృందావనంలోని కేశవధామ్ శ్రీకృష్ణ కథా ప్రశిక్షణ కేంద్రం ద్వారా హార్మోని యం` తబలాపై భజనలు ఆపైన శ్రీహరి కథాగంగ పరవళ్ళు త్రొక్కుతుంటాయి. దేశభక్తి గీతాలు` దేశభక్తి భజనలు మారుమ్రోగుతుంటాయి. సభా మందిరంలో భక్తి` పారవశ్యంతో పలికే నినాదాలు` ఉత్సాహంతో ఉర్రూతలూగించే యువకులను చూస్తే, ఎవరు వారు? ఏమిటా మిషన్?! అని అడగాలని కుతూహలం ఏర్పడుతుంది. ముచ్చటగా ముప్పది రెండు మంది నవయువకిశోరాలు ఆరు` నెలలపాటు పూర్తిగా బ్రహ్మచార వ్రతం ఆచరిస్తుశ్రీకృష్ణ` భాగవత` పురాణ`కథప్రశిక్షణలో రాటుదేలుతున్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత గ్రామ`గ్రామాన పట్టణాలోకథ`రసామృతప్రవచనాలిస్తు సామాజిక` సమరసత` సుసంస్కార మును ప్రబోధిస్తు.. ఆచరింపజేస్తున్నారు. జాతి` కుల`వర్ణ`వర్గ` వైషామ్యాలకు దూరంగామమైవాంశ జీవ భూతోస్సనాతనయంటు అందరిని ఒక్క త్రాటిపై తీసుకొస్తున్నారు. 1995లో స్థాపింపబడిన సమితి ఏకల్ విద్యాలయాలలో భాగమేనని శ్రీ శ్యామ్జీ గుప్తా (విశ్వహిందూపరిషత్ అఖిల భారత అధికారి) చెప్పారు. ఏకల్ విద్యాలయాల ద్వారా 50వేల గ్రామల్లో ప్రాథమిక విద్యా మరియు ఉత్తమ సంస్కారాలను అందించే ప్రయత్నం జరుగుతున్నది. కేంద్రా ప్రయత్నం ద్వారా గ్రామాలలో సమరస భావం నిర్మాణం చేస్తున్నారు. వీటితో పాటు వైద్య శిబిరాలు, నైపుణ్య వికాస శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. 5వే మంది కార్యకర్తలు పనిలో ఉన్నారు.