రాజకీయ సుడిగుండంలో దళితులు2014 సంవత్సరం భారత చరిత్రలో ఒక ప్రధానమైన సంవత్సరం. మొదటిసారిగా ఒక జాతీయ భావలను కలిగిన పార్టీ ఎన్నికలలో గెలిచింది, ఒక దేశ భక్తునికి ప్రధాని అయ్యే అవకాశం కూడా లభించింది. ఐతే! ‘వంకలేని అమ్మడొంక పట్టుకుని ఏడ్చిందిఅన్నట్లు, జాతీయ వ్యతిరేక శక్తులన్నీ కుమ్మక్కయి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణంగా తూర్పార బెడుతున్నాయి. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు వీరికి దళితుల సమస్య మీద రగడ చేసే అవకాశం దొరికింది. ఇంకేం! వారు రెచ్చిపోయారు. ప్రధానిమోడీ, కేంద్ర ప్రభుత్వమూ, బిజేపీ, వీరంతా దళితులను కాల్చకుని తింటున్నారని ప్రచారం మొదలుపెట్టారు. హెచ్సీయులో వేముల రోహిత్అనే ఒక విద్యార్థి ఏదో కారణంగా ఆత్మహత్య చేసుకుంటే, దానికి మోడీనే స్వయంగా బాధ్యుడయినట్లు జాతి విద్రోహ శక్తులందరూ నానాయాగీ చేస్తున్నారు. ఐతే ఇంతకూ వాస్తవాలు ఏమిటా అని అడుగుతారా? ఔనండీ అడగవలసిందే! విషయంలో సాక్షాత్తూ దళిత నాయకులు ఏమంటున్నారో చూడండి.
ఎస్సి/ఎస్టీ విజిలెన్స్కమిటీ సభ్యుడు ప్రేం కుమార్చేసిన ప్రకటన వివరము..
కాంగ్రెస్నాయకత్వంలో నడిచిన యుపిఏ ప్రభుత్వం హయాంలో దళితుల మీద 16,716 అత్యాచారాలు జరిగాయి, వీటి కారణంగా prevention of atrocities on sc/st act క్రింద కేసు పెట్టబడ్డాయి. protection of civil / rights (pcr) act క్రింద మరొక 587 కేసులు రిజిస్టర్అయ్యాయి. ఇంతచేసినా నేరస్థులకు శిక్షపడిన కేసు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి. అని ఆయన వాపోయాడు.’ కాకతీయ విశ్వవిద్యాలయం అంబేడ్కర్స్టడీ సర్కిలో పూర్వపు సంచాలకుడు ప్రొఫెసర్కృష్ణయ్య మాట్లాడుతూనేటికి 292 కేసులు ఇంకా పరిష్కారం కాకుండా కోర్టులో మూలుగు తున్నాయిఅన్నారు. ప్రధానిగా మోడీ కూర్చున్న ఆసనం పూలపాన్పు కాదు, అది ఒక ముళ్ళ సింహాసనం. అవిశ్రాంతంగా పనిచేస్తూ దీనులకు దళితుకు సేవచేసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద అనైతిక దాడి ఇకనైనా ఆగుతుందని ఆశిద్దాం!