అమరవాణి

శ్లో॥ శఠం ప్రతిశఠం బ్రూయాత్‌
ఆదరం ప్రతి చాదరమ్‌
తత్ర దోషోన భవతి
దుష్టే దుష్టం సమాచరేత్‌

- ఆర్యవాక్కు
వంచకుడిని వంచిస్తూనే మాటలాడాలి. ఆదరం చూపించేవానితో ఆదరంగా మాటలాడాలి. దుష్టుడి విషయంలో దౌష్ట్యమే చూపాలి, ఇందులో తప్పేమీ లేదు. దుష్టుల విషయంలో శాంతి పనికిరాదు.