దేశ భక్తా? అదెలా ఉంటుంది?నిజమే కదా? సందేహం కలిగితే నివృత్తి చేసుకోవాలి కదా! సరే ప్రశ్న మనకు కఠినమైనదే పోనీ విదేశాలలో ఏమయినా దొరుకుతుందేమో చూద్దామా? రండి ఫ్రాన్స్దేశానికి వెడదాము. ఇటీవల తీవ్రవాద దాడులకు గురైన ఫ్రాన్స్కొన్ని దినాలలోనే ఇస్లామిక్తీవ్రవాదులందరినీ వెతికి వెతికి మట్టుపెట్టింది. అంతేకాదు వారు ఇంకొక పని కూడా చేశారు. ‘తీవ్రవాదులు, వారికి సహకరించేవారు, సానుభూతి పరులైన మొదలైన వారందరికీపౌరసత్వం’ (సిటిజన్షిప్‌) రద్దు చేయాలని పార్లమెంటులో ప్రతిపాదించి తదనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించారు. ఫ్రాన్స్పార్లమెంటు ప్రాతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశం కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అనేది వారి ఆలోచన. మన దేశంలో అట్లా ఆలోచించడం మతోన్మాదం లాగా కొందరికి కనబడవచ్చు. కాని దానిని అందరూ  దేశభక్తిఅంటారు.