ఇష్రాత్‌ అమాయకురాలు కాదు2004 సం శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అహ్మదాబాద్ఎన్కౌంటర్యొక్క వాస్తవాలు ఈరోజున బయటకు వస్తున్నాయి. ముంబయి కోర్టులో పాకిస్తాన్ఉగ్రవాది డేవిడ్హెడ్లీ వీడియో ద్వారా వాస్తవాన్ని బయటకు వస్తున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్పార్టీ, వామపక్షాలు చేస్తున్న యాగీ యొక్క అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతున్నది.  2014 జూన్‌ 15 తేది అహ్మదాబాద్పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇష్రాత్జహాన్‌, రజా, జావేద్‌, అహ్మద్ఆలీ రానా, జిహాన్జోహర్లు మరణించటం జరిగింది. బిజెపి సీనియర్నాయకుడు శ్రీ అద్వానీ మరియు శ్రీ మోడీలను అంతం చేయటానికి ఉగ్రవాదులు పథక రచించినట్లు గుజరాత్పోలీసులు ప్రకటించారు. కానీ ఇష్రాత్కుటుంబ సభ్యులు, కాంగ్రెస్పార్టీ, వామపక్ష నాయకులు ఇష్రాత్అమాయకురాలని పోలీసులు కావాలనే వీరిని బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని దేశంలో పెద్ద ఎత్తున దుష్ప్రాచారం చేసారు. ఎన్కౌంటర్విషయంలో అనేక దర్యాప్తులు జరిగాయి. సెప్టెంబర్‌ 2009 లో అహ్మదాబాద్మెట్రోపాలిటన్కోర్టు దీనిని నకిలీ ఎన్కౌంటర్గా తీర్పు చెపితే, గుజరాత్ప్రభుత్వం దాన్ని హైకోర్టులో సవాలు చేసింది. కేసు కోర్టులో రకరకాలుగా మలుపు తిరిగి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు దారితీసింది. గుజరాత్హైకోర్టు డిసెంబర్‌ 2011లో సిబిఐ  దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల ముంబై దాడికేసులో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న పాకిస్తాన్తీవ్రవాది డేవిడ్హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం పాకిస్తాన్ఉగ్రవాద సంస్థ ఎల్‌..టి మహిళా విభాగంలో ఇష్రాత్జహాన్సభ్యురాలని స్పష్టంగా తెలుస్తున్నది. సాక్ష్యం ఎల్‌..టి/ ఐఎస్ఐకి గల సంబంధాలు వాళ్ళు భారత్లో జరిపే దాడుల కుట్ర గురించి వాస్తవాలు బయటపడ్డాయి. ఇష్రాత్అమాయకురాలు కాదని, తొటి నేర చరిత్ర కలిగిన ఉగ్రవాదులతో కలిసి మోడీని అంతం చేసుందుకు కుట్ర పన్నినట్లు హెడ్లీ ద్వారా స్పష్టం అయ్యింది. పాకిస్తాన్ఒక పథకం ప్రకారం గుజరాత్పై దాడి చేయటానికి కుట్రలు పన్నుతున్నందునే విషయం స్పష్టం అయ్యింది.  గత యుపిఏ ప్రభుత్వం సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేసింది, ఐబి మాజీ స్పెషల్డైరెక్టర్రాజేంద్రకుమార్ వెల్లడించిన విషయంతో స్పష్టం అవుతుంది. అప్పుడు యుపిఏ ప్రభుత్వం ఎన్కౌంటర్కేసులో మోడీని ఇరికించటానికి తప్పుడు సాక్షాలు సృష్టించమని తనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు ప్రకటించారు. ఇష్రాత్అమాయకురాలు కాదని బయట పడడంతో కాంగ్రెస్పార్టీ, వామపక్షాలకు గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లు అయ్యింది. ఇకనైనా మనవాళ్ళు తమ స్వార్థ రాజకీయాలకోసం తీవ్రవాదులను హీరోలుగా చిత్రీకరించే పని మానుకొని పొరుగుదేశం పాకిస్తాన్చేసే కుట్రలో భాగం కాకూడదని మనం కోరుకుందాం.