సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశలో కేంద్ర బడ్జెట్‌భారతదేశము ఆరులక్షలకుపైగా గ్రామాలున్నదేశం. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. స్వాతంత్య్రము వచ్చిన వెంటనే గాంధీజీదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాసింది గ్రామ స్వరాజ్యంఅని అన్నారు. అంటే గ్రామాలు స్వపరి పాలనలో స్వావలంబనతో ఆర్థిక వికాసము చెందాలి. స్వాతంత్య్రము వచ్చిన నాటి నుండి మన పాలకులు పారిశ్రామీకరణ, పట్టణాభివృద్ధికే పెద్దపీట వేసారు . దానితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. గ్రామీణలు బ్రతుకు దెరువుకోసం గ్రామాల నుండి వలసలు రావటం ప్రారంభమైంది. దశాబ్దాలుగా సాగుతున్న వలసలు చాలా సమస్యలు సృష్టించాయి. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. దానిని అరికట్టాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ఆర్థిక విధానం మారాలి. కొన్ని దశాబ్దాల తరువాత ఫిబ్రవరి 27 పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన బడ్జెట్గ్రామీణ పేద బడ్జెట్గా ఉంది. గ్రామాభివృద్ధి, పేద అభివృద్ధికి ఇది తొలి అడుగు అనవచ్చు.
ఈసారి బడ్జెట్లో పెద్ద పన్ను భారం మోపలేదు. అభివృద్ధి సాధన లక్ష్యాలు విస్మరించలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు. తాయిలాలతో వివిధ వర్గాలను ఆకట్టుకోలేదు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ఎవరికి వారు సొంతకాళ్ళపై నిబడేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయని అనిపిస్తున్నది. పేదల బడ్జెట్అమలు చేసేందుకు సంపన్నుల పట్ల ఒకింత కాఠిన్యం వహించి పన్ను పెంచారు. మొత్తం మీద మౌలిక వసతులు పెంచటం, గ్రామీణ వ్యవస్థతో ముడిపడి ఉన్న రంగాల అభివృద్ధికి పెద్దపీట వేసి బడుగు వర్గాల ప్రజలకు ఊరట కలిగింగే ప్రయత్నం కనబడుతుంది. ఇది సక్రమంగా అమలు జరిగి రాబోవు కొన్ని సం దిశలో ప్రయాణం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక గాడిలో పడి దేశంలో ఒక మంచి మార్పు వస్తుంది.