సియాచిన్‌లో సైనికుల వీరవ్రతం
హిమాలయ పర్వతాల్లో, తూర్పున ఉన్న కారంకోరం పర్వతశ్రేణిలో భారత పాకిస్తాన్సరిహద్దు ముగిసే చోట వుంది సియాచిన్‌. సియాచిన్అంటే బాల్పి భాహాల్సియా అనేది రకం గులాబీ. ‘చున్‌’ అంటే పుష్కలంగా లభించేది అని అర్థం. ప్రపంచంలో రెండవ అతిపొడవైన పర్వత శ్రేణి అది. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున మంచుతో నిండివున్న ప్రాంతమిది. ‘పాకిస్తాన్వైపుయిది మూడు వేల అడుగుల దిగువకు వుంది. కనుక పాకిస్తాన్సైనికులు సులభంగా సియాచిన్గుండా రాగలరు. అందుకే అక్కడ సైనికుల గస్తీ. ప్రాంతంలో `96 డిగ్రీల సెంటీగ్రేడ్ఉష్టోగ్రత వుంటుంది. 1984 నుండి ఇప్పటివరకు 869 మంది సైనికులు ప్రాణాలు వదిలారిక్కడ. ఎముకలు కొరికే చలిలో భార్యపిల్లల్ని వదిలి దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఇక్కడ వీరవ్రతం సాగిస్తుంటారు. ఏటా అక్కడ 0.2సి ఉష్టోగ్రత పెరుగుతుంటుంది. 2001లో భారత ప్రభుత్వం అక్కడ పనిచేసే సైనికుల కోసం 250 కి.మీ. పొడవునా కిరోసిన్‌, విమాన ఇంధన సరఫరాలకై పైప్లైన్లను వేసింది. అబ్దుల్కలామ్ఇక్కడకు వచ్చిన భారత మొదటి రాష్ట్రపతి. 2012లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్‌, 2014లో నేటి ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడ పర్యటించారు. కార్గిల్యుద్ధం తరువాత సైన్యం ఉపసంహరించుకోకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ మంచు తుఫానులు మామూలే. ఫిబ్రవరి 3 వచ్చిన మంచుతుఫానులో 10మంది భారత జవానులు  మంచులో 25 అడుగుల లోతున కూరుకుపోయారు. ఇంత ఎత్తులో మనిషి శరీరం అసలు సహకరించదు. ఇక్కడ గాలి గంటకు 100 మీటర్ల వేగంతో వస్తుంది. ఇక్కడి రక్షణకి రోజుకి 7 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. దాదాపు 10000 మంది సైనికులు కి.మీకి. ఒక పోస్టు చొప్పున కాపలాకాస్తారు. అక్కడ పనిచేసిన ప్రతిసైనికుడికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి అయినా వెన్నుచూపరు. వారి నిద్ర కేవలం మూడు గంటలు, ఎక్కువ పడుకోలేరు, పడుకుంటే కోమాలోకి వెళ్ళిపోతారు. మంచులోనే వంట. వారికి ఆహారం రెండు రోజులకొకసారి హెలికాప్టర్ద్వారా అందిస్తారు. శరీరం మీద 25 కి.గ్రా బరువు మోస్తూ విధి నిర్వాహణ చేస్తారు. 11 గంకు ఎండను నేరుగా చూడాలని ప్రయత్నిస్తే కళ్ళు పోతాయి. వారానికి ఒకసారి వారి ఇంట్లో వాళ్ళతో కేవలం 3నిలు మాట్లాడేందుకు అనుమతిస్తారు. ప్రాణాపాయం వస్తే హెలికాప్టర్ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ పనిచేసి వచ్చిన కొందరు సైనికుల శరీర అవయవాలు మంచుకి పనిచేయక పాడైపోయాయి తొలగించారు. శత్రువుల నుండి మనకు మన దేశానికి రక్షణ ఇస్తున్న మన సైనికులకు మనం ఏమి ఇవ్వగలం? గుండె నిండుగా అశ్రునీరాజనాలు తప్ప.
జై జవాన్‌! భారత్మాతాకీ జై..