ఆధునిక రుషి టివి నారాయణ 
సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో భాగ్యనగర్ వాస్తవ్యులైన టివి నారాయణగారికి కూడా ఇవ్వబడింది.  టివి నారాయణగారు భాగ్యనగర్ వాస్తవ్యులుగా, ఒక విద్యావేత్తగా అందరికీ సుపరిచితులు. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29 తేది సాయంత్రం 6 గంటలకు ఇందిర ప్రియదర్శిని హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించబడిరది. కార్యక్రమానికి జస్టిస్ సివి. రాముగారు అధ్యక్షత వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిల భారత సహ సర్ కార్యవాహ శ్రీ.భాగయ్యగారు కూడా పాల్గొన్నారు. వివరాలు...
అనేక సద్గుణాలున్న ఆధునిక రుషి డాక్టర్ టివి నారాయణ అని ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త కార్యదర్శి భాగయ్య పేర్కొన్నారు. డాక్టర్ టివి నారాయణకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా సామాజిక సమరసతా వేదిక తరపున అభినందన పూర్వక కార్యక్రమానికి నివృత్త న్యాయమూర్తి జస్టిస్ సివి రాము అధ్యక్షత వహించారు. భాగయ్యతో పాటు మాజీ మంత్రులు టి.పురుషోత్తమరావు, గీతారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ద్రావిడ వర్శిటీ మాజీ విసి ఆచార్య రవ్వా శ్రీహరి, ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు విఠల్రావు, సాహితీవేత్త డాక్టర తిరునగరి సహా పలువురు నేతలు, విద్యావేత్తలు అభినందన కార్యక్రమంలో నారాయణ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
భాగయ్యగారు: నారాయణ గారికి 20 సం పూర్వమే పద్మశ్రీ అవార్డు రావలసి ఉంది. అంబేద్కర్ను, వివేకానందుడ్ని మొదలైన వారిని మనం చూడలేదు, కాని గుణాలతో మన ముందు ఉన్నారు నారాయణగారు. నారాయణగారు నిజాయితీకి మారుపేరు. మన సనాతన ధర్మం సృష్టిలో ఏకాత్మతను దర్శించింది. అంటారానితనం రోజుకు కూడా ఉంది. ఇది అన్యాయం, దుర్మార్గం. వైషమ్యాలను దూరం చేసి సమాజంలో ఏకాత్మతను దర్శించాలి. నాగపూర్లో జరిగిన విజయదశమి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా టి.వి. నారాయణగారు ఒకసారి పాల్గొన్నారు. వేదాలలో, ఉపనిషత్లో చెప్పిన విధంగా జీవించినవారు నారాయణరావుగారు అని వివరించారు
టివి నారాయణగారు: నాకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కార్యక్రమంలో నా మిత్రులు, హితైషులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న అందరూ ఋషిపుత్రులు. దానికోసమేఅర్థపుత్రశతకంవ్రాసాము. అది దైవచ్చా. అవి అన్ని ఉపనిషత్తులు, వేదాలకు సంబంధించింది. గాంధీగారు ఆధ్మాత్మిక వేత్త, వారు నిజజీవితానికి ఆదర్శం. డా అంబేద్కర్ ఒక పుస్తకం వ్రాసారు. దానిలో మన దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది కాని సామాజిక స్వాతంత్య్రం రాలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి స్వాంతత్య్రం రావాలని చెప్పారు. డాక్టర్జీ జీవితం చదివాను, వారి ఇళు్్ల కూడా చూసాను. వారు చాలా గొప్పదేశ భక్తులు. సంఘం నుండి మేము దేశభక్తిని నేర్చుకొన్నాను. నేను ఒక టీచర్ను, మాట్లాడుతూనే ఉంటాను. కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలు అర్పిస్తున్నా. క్రోధం వదిలి వినయంగా జీవించాలి. దానితోనే జీవితం ధన్యమవుతుంది. నేను అలాగే జీవించాను. మీరు అలా జీవించాలని కోరుతున్నాను.