చారిత్రక మహా పురుషులను గౌరవిస్తున్న కేంద్ర ప్రభుత్వంచరిత్ర పురుషుల జన్మదినోత్సవాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి వంద కోట్లను కేటాయించింది. దీన్దయాల్ఉపాధ్యాయ జన్మదినోత్సవం, గురు గోవింద్సింగ్‌ 300 జన్మదినోత్సవాలను ఘనంగా జరపాలని నిశ్చయించింది. సంప్రదాయం ఇప్పుడు మాత్రమే వచ్చింది కాదు. చారిత్రక పురుషుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరిపి వారి త్యాగనిరతిని శ్లాఘించుకోవడం మన విధి. కాకుంటే గత ఏడాది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రకటించినా నిధులను కేటాయించలేదు. ఇప్పుడు నిధులను కేటాయించి వారి ప్రాముఖ్యాన్ని దేశానికి చాటాలని నిర్ణయించింది.