స్వామి వివేకానందుడు.. వివేకహీనుడా?!

వివేకానందడు కుల వ్యవస్థ సమర్థకుడు, స్త్రీ ద్వేషి, తప్పుడు మేధావి. తనను తాను అధికంగా భావించేవాడు. వివేకహీనుడు, శాస్త్రబద్ధంకాని ప్రసంగాలు చేసేవాడు, నిజమైన తెలివితేటలు కలవాడు కాదు. ఇలాంటి వ్యక్తి జయంతిని మన కేంద్రీయవిశ్వవిద్యాయంలో ఆనవాయితీగా జరపటం పట్ల నేను ఆశ్చర్యపోతున్నాను, నిరుత్సాహ పడుతున్నాను..’ అంటూ హైదరాబాద్కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి జనవరి 8, 2016 తన ఫేస్బుక్లో రాసుకొని విషం కక్కాడు. స్వామి వివేకానందుని 150 జయంతుత్సావాలను ఘనంగా జరుపుకొని, చికాగో ప్రపంచ మత మహాసభలో తన వాక్పటిమతో దేశ` విదేశమేధావుల అభిమానాన్ని చూరగొని, అప్పటికి-ఇప్పటికి ప్రపంచమంతటికి గౌరవ ప్రీతిపాత్రుడైన స్వామిజీ పట్ల విద్వేష పూరిత, విషపూరిత భావాజ్వాల` అగ్నిలో గుగ్గిలైన వాడు ఇంకెవరో..అతనే రోహిత్వేముల. ఇటువంటి రోహిత్మేములాలు.. మారుమూల గ్రామాల నుండి ఉన్నత విద్యనభ్యసించి తమ బంగారు భవిష్య త్తు సౌధాము నిర్మించుకుందామని కలలు కని వచ్చిన వారిని అపరమేధావులనబడే విదేశీయ` వికృత` భావజాల ప్రొఫేసర్లు ఎంతటి విషం నూరిపోస్తున్నారో అర్థం అవుతుందా? కులం పేర` వర్ణంపేర` అణగారిన విద్యార్థిని` విద్యార్థులను చేరదీసి, రెచ్చగొట్టి రచ్చకీడ్చి వారిని మానసిక వికాసోన్ముఖులను చేయాల్సిన వీరు మానసిక రుగ్మతలు రగలించి మేధోన్మాదులుగా తీర్చిదిద్ది వీర్రవీగుతున్నారు. అసహనం ` ఆక్రోశం` అశాంతి` అస్థిరత` అవార్డు` తిరిగి ఇచ్చేయడం లో కుహాన మేధావి వర్గం` ప్రొఫెసర్స్‌, విదేశీయ` మేతావిదర్పం` ఫలితమే రిసర్చ్జేసి భారత బావుటాను రెపరెపలాండించిన విద్యార్థి.. వివేకానందునిపై ఇలాంటి వ్యాఖ్యలు రాసుకున్నాడంటే ఎంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడో ఇక్కడ గ్రహించవచ్చు.