రాహుల్‌జీ! ఈ దేశ యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా!
పాకిస్తాన్జిందాబాద్‌!

తుక్డాకరేంగే తుక్డాకరేంగే భారత్కో తుక్టా కరేంగా’ (భారతదేశాన్ని ముక్కలు చేస్తాం)

భారత్కీ బర్బాదీతక్జంగ్రహేంగే జంగ్రహేంగే!’ (భారతదేశం సర్వనాశనమయ్యే వరకు పోరాటం ఆగదు)

కాశ్మీరీ ఆజాదీ తక్జంగ్రహేంగే జంగ్రహేంగే’ (కాశ్మీర్స్వాతంత్య్రం ` భారత్నుండి విముక్తి పొందేవరకు పోరాటం కొనసాగుతుంది)

ఘర్ఘర్సే ఆఫ్జల్నిక్లేంగే’ (ఒక ఆఫ్జల్ను ఉరి తీస్తే ఇంటింటికి ఒక అఫ్జల్పుడుతాడు)

ఇండియా గోబ్యాక్

ఇండియన్ఆర్మీ ముర్దాబాద్
నినాదాన్నీ పాకిస్తాన్లోనో జమ్మూ కాశ్మీర్లోనే తీవ్రవాదవర్గాలు చేసినవి అనుకుంటున్నారా ఐతే మీరు పప్పులో కాలేసినట్టే! ఇవన్నీ భారత రాజధాని నడిబొడ్డున జవహర్లాల్నెహ్రూ విశ్వవిద్యాయంలో (జెఎన్యూ)లో వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలు చేసిన నినాదాలు! ఆశ్చర్యపోతున్నారా? ఇంకా వివరంగా తొసుకోవాలంటే వారి వితండ వాదనను పూర్తిగా తెలుసుకోవలసిందే! దాదాపుగా గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్పాలనలో దేశంలోని విద్యా వ్యవస్థలను సెక్యూరిజం పేరుతో చరిత్రను, వాస్తవాలను వక్రీకరిస్తూ  మైనారిటీలను సంతృప్తి పరిచేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి చరిత్రను సమూలంగా మార్చివేసి, దేశం యొక్క గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, జాతి ఆత్మగౌరవాన్ని ఈదేశ విద్యార్థులకు తెలినీయకుండా చేసిన పర్యవసానమే` నేటి జెఎన్యూ సంఘటన. దేశంలోని కొన్ని ప్రముఖమైన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాయాలు, సాంస్కృతిక, సాహిత్య సంస్థలో దేశంలో అనేక వేల సంవత్సరాలుగా వెలుగొందిన సాంప్రదాయ విజ్ఞాన పరిశోధనలను అధ్యాపనలను, పాఠ్యాంశాలను మరుగునపరుస్తూ వచ్చారు. వామపక్ష భావజాలపు కుహానా సెక్యూలరిస్టు మేధావులను అధ్యాపకులుగా, పాలనాధికారులుగా నియమించి ఆయా సంస్థల పాఠ్యవిధాయక నిర్ణయాత్మక సంఘాలలో వారినే నియమిస్తూ రావటం  వల్ల సెక్యూలరిజం పేరుతో చరిత్ర పాఠాలను వక్రీకరించారు. దానితో దేశంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాయాలో గత 20-30 సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులైన కొందరు విద్యార్థులు దేశ భద్రత సమైక్యతకు భంగం కలిగించే విధంగా జాతివ్యతిరేక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. పీపుల్స్డెమోక్రటిక్స్టూడెంట్స్యూనియన్‌(పీడిఎస్యూ), రాడికల్స్టూడెంట్స్యూనియన్‌(ఆర్ఎస్యు) వంటి అనేక వామపక్ష తీవ్రవాద భావజాల విద్యార్థి సంఘా లను దేశ ఆంతరంగిక భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంచే నిషేదించబడినవి. స్టూడెంట్ఇస్లామిక్మూమెంట్స్అఫ్ఇండియా (సిమీ) లాంటి ఇస్లామిక్తీవ్రవాద సంస్థను ప్రభుత్వం నిషేధించింది. నిషేధించబడిన సంఘాల సభ్యులు క్రొత్త అవతారంగా డెమెక్రటిక్స్టూడెంట్స్యూనియన్‌ (డీఎస్యు),అంబేద్కర్స్టూడెంట్స్యూనియన్అనే పేర్లపై కొత్త విద్యార్థి సంఘాలను స్థాపించి పనిచేస్తున్నారు. మానవహక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, అభ్యుదయవాదం, అనే ముసుగులో జాతి వ్యతిరేక సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ జాతి వ్యతిరేక కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయాలను తమ జాతి వ్యతిరేక కార్యక్రమాలకు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో చట్టబద్దత కల్పించే అడ్డాలుగా వాడుకుంటున్నారు. వీటిని బయటనుండి వామపక్ష భావజాలపు స్వచ్చంద సంస్థలు, తీవ్రవాద సానుభూతి పరులు సమర్థిస్తున్నారు. విదేశాల నుండి నిధులను పొందుతూ వీరికి సహాయం సహకారాలు వారు అందజేస్తున్నారు.