డాక్టర్‌జీ ఒక యుగ ద్రష్టతెలంగాణ ప్రాంతంలోని ఇందూరు జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్రానదుల సంగమ స్థలము కందకుర్తి గ్రామము. శతాబ్ధాలకు పూర్వము గ్రామంలో వేద అద్యయనము, శాస్త్రాధ్యయనము వృత్తిగా కలిగిన ఒక కుటుంబం.  నైజాము పాలనలో పరిస్థితులు అనుకూలంగా లేక కుటుంబానికి చెందిన నరహరిశాస్త్రి కుటుంబము నాగపూర్వెళ్ళిపోయింది. వంశంలోని బలీరాం పంత్కుమారుడే డా కేశవరావు. హిందూ సమాజ సంఘటనకు తన జీవితాన్ని సమర్పించుకొన్న వారు డాక్టర్జీగా పివబడే కేశవరావు బలీరాంపంత్హెడ్గేవార్‌. డాక్టర్జీ ఉగాది పండుగ రోజు 1889 సం ఏప్రిల్‌ 1 తేది నాడు జన్మించారు. డాక్టర్జీ పని చేసిన దేశహితం అనే గీటురాయి మీదనే జీవితాంతం పనిచేశారు. డాక్టర్జీ నాగపూర్నుండి కలకత్తా వెళ్ళి అక్కడ డాక్టర్కోర్సు చదువుతూ అనుశీలన సమితిలో చేరి పనిచేసారు. విప్లవ కార్యకలాపాలో పాల్గొన్నారు. వైద్య విద్య పూర్తి అయిన తరువాత నాగపూర్తిరిగి వచ్చి కాంగ్రెసు సంస్థలో చేరి స్వాతంత్య్ర పోరాట ఉద్యమాలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. రోజుల్లో దేశం బ్రిటీష్సామ్రాజ్యవాదుల చేతులలో ఉంటే, ఈరోజు ఆర్థిక సామ్రాజ్యవాదుల మధ్య నలుగుతున్నది. సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొవాలంటే జన సామాన్యము చైతన్యవంతమై శక్తివంతం కావాలనేది డాక్టర్జీ ఆలోచన.
భారతదేశ చరిత్రలో 1857 సం తరువాత ఈస్టిండియా కంపెనీ పాలన అంతమయ్యింది. బ్రిటిష్పార్లమెంట్నేరుగా భారతదేశాన్ని పరిపాలించటం ప్రారంభమైంది. సమయంలో బ్రిటిష్పార్లమెంట్భారత్లో కూడా పార్లమెంటరీ పరిపాలనను అంచెంలంచెలుగా ప్రారంభించింది.  దానికి అనుగుణంగానే 1885 సంలో కాంగ్రెసు సంస్థ ప్రారంభమైంది. 1905 సం ముస్లిం లీగ్ప్రారంభమైంది. 1920 సం నాటి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. అదే సమయంలో హిందూ మహాసభ కూడా ప్రారంభమైంది. సంస్థలు ఒక ప్రక్క దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాటము చేస్తూనే మరోప్రక్క ఎన్నికలో పాల్గొని పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు. ఒక ప్రక్క ఇది నడుస్తుంటే రెండవ ప్రక్క ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేచింది. సంఘర్షణ ఈరోజున కూడా కొనసాగుతున్నది. సంఘర్షణకు ఇంకా తెరపడలేదు. ముస్లిం దండయాత్రతో దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ఒక ప్రక్క దేశ రాజ్యాధికారాన్ని చేతులోకి తీసుకొంటూ రెండవ ప్రక్క పెద్ద ఎత్తున మత మార్పిడులు చేస్తూ దేశాన్ని ఇస్లామీకరణ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అది రోజున కూడా కొనసాగుతున్నది. బ్రిటిష్వారి ప్రవేశంతో దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి. 1920 సంవత్సరంలో ప్రారంభóమైన కమ్యూనిజం నుంచి నక్సలిజం పుట్టుకొచ్చింది. అది రోజున మావోయిజం పేరుతో నడుస్తున్నది. బ్రిటిష్వారు సృష్టించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాల నుంచి పుట్టిన మేధావి వర్గం కూడా పనిచేస్తున్నది. వీటన్నింటి మధ్య రోజున కూడా దేశం నలుగుతున్నది. డాక్టర్జీ పరిస్థితులపై ముందుగానే విశేష అధ్యయనం చేసారు. భవిష్యత్లో రాజ్యాధికారశక్తిని నియంత్రించే జాతీయ శక్తి నిర్మాణం జరగాలని సంకల్పించారు. అందుకే కాంగ్రెస్సంస్థనుంచి బయటపడి 1925 సంవత్సరం విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్సంఘాన్ని ప్రారంభించారు. భారతదేశంలో వేల సం నుంచి రాజ్యవ్యవస్థ సమాజ వ్యవస్థలో ఒక భాగంగా ఉండేది. అదే సర్వస్వం ఎప్పుడూ కాలేదు. ఆధునిక కాలంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వస్వం అయ్యే ప్రమాదంగా కనబడుతున్నది.. దాని అనుభవం రోజున కూడా చూస్తూన్నాం. అందుకే డాక్టర్జీ హిందూ సమాజ సంఘటన కార్యనికి శ్రీకారం చుట్టారు. హిందూ సమాజసంఘటన కార్యానికి రెండు విశేషాలు జోడించారు. 1. సంఘకార్యం ఈశ్వరీయ కార్యము 2. సంఘకార్యం రాష్ట్రీయ కార్యము. రెండు మాటలతో సమాజ సంఘటన కార్యం గురించి డాక్టర్జీకి గల కల్పన మనకు అర్థమవుతోంది. సంఘకార్యం ద్వారా సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశమంతట తయారు కావలనేది వారి లక్ష్యం. తద్వారా దేశమంతట దేశహితం గురించే ఆలోచించే వ్యవస్థ నిర్మాణమై అదే దేశానికి శ్రీరామరక్ష కావాలి. ఈరోజున దేశమంతటా వారి ఆలోచనలు సాకార రూపంలో మనకు కనబడుతున్నాయి. రోజున దేశంలో యాబైవేలకు పైగా గ్రామాలలో సంఘం ప్రవేశించి పనిచేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే లక్ష గ్రామాలకు చేరుకోవాలనేదే సంఘం లక్ష్యం. హిందూ సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేసే పనిని కొందరు రోజు నుండి రోజు వరకు చేస్తూనే ఉన్నారు.దాని పర్యవసానాలు నేడు దేశంలో మనం చూస్తున్నాము. విద్వేషాల మూల కారణాలు అర్థం చేసుకొని వాటినుంచి హిందూసమాజం బయటపడాలి. మనమందరం ఒకేజాతివారం అనే భావన నిర్మాణం కావాలి. ఇటువంటి ఆలోచనను మనకు కలిగిం చిన డాక్టర్జీ ఒక యుగద్రష్ట.